BIKKI NEWS (AUG 16) : TODAY NEWS IN TELUGU on 16th AUGUST 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 16th AUGUST 2024
TELANGANA NEWS
తెలంగాణలో భారీ వర్షాలు… ఎల్లో అలర్ట్ జారీ, హైదరాబాద్ మరియు శివారు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
మూడో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల.
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తున్న హైడ్రా
పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాలకు త్వరలోనే ఉప ఎన్నికలు – కేటీఆర్
సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
రైతు రుణమాఫీ చేశాం… హరీష్ రావు రాజీనామా చేయాలి. సీఎం రేవంత్
మహిళలపై కేటీఆర్ కామెంట్స్ నేపథ్యంలో సుమోటోగా కేసు నమోదు చేసిన మహిళ కమిషన్
ప్రస్తుతం ప్రభుత్వం లోని పెద్దలఫై ఉన్న కేసులను సీబీఐ, ఈడీ కి అప్పగించాలని దాఖలైన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు
ANDHRA PRADESH NEWS
ప్రజల విరాళాలతో నడిచే అన్న క్యాంటీన్లకు పచ్చ రంగు ఎందుకు ? : మాజీ మంత్రి కాకాణి
ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు.. రోగులకు ఇబ్బందులు మొదలు
కృష్ణ జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన చంద్రబాబు
మాజీ మంత్రులు రోజా ధర్మాన ప్రసాదరావు పై సీఐడీ విచారణ
NATIONAL NEWS
అస్సాంలో 24 చోట్ల బాంబులు అమర్చామన్న ఉల్ఫా(ఐ).. ఐఈడీ వంటి వస్తువులు గుర్తింపు
ఐరాసలో భారత శాశ్వత రాయబారి గా పర్వతనేని హరీశ్ నియామకం.
షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ ప్రయోగం.. కౌంట్‌డౌన్ స్టార్ట్
ఒడిశా ప్రభుత్వం ‘సుభద్ర యోజన’ ను ప్రారంభిస్తున్నామని ప్రకటించింది.. ఈ పధకం కింద మహిళలందరికీ సంవత్సరానికి రూ. 50,000/- అందచేస్తామని తెలిపింది.
భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం : స్వతంత్ర వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ
ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ఒక్క రోజు నెలసరి సెలవు ఇస్తున్నట్లు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
మోదీ జీ మణిపూర్ ను సందర్శించండి – రాహుల్ గాంధీ
INTERNATIONAL NEWS
ఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్ విస్తరిస్తున్నది. ఇందులో 96శాతానికిపైగా కేసులో కేవలం కాంగోలో మాత్రమే గుర్తించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ బలగాలు.. 74 నివాస ప్రాంతాలను ఆధీనంలోకి వచ్చాయన్న జెలెన్‌స్కీ.
థాయ్‌లాండ్‌లో రాజ్యాంగ న్యాయస్థానం నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన 62 ఏండ్ల ప్రధాని స్రెట్టా థావిసిన్‌ను తక్షణం పదవి నుంచి తొలగిస్తూ ఆదేశించింది.
మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. జపాన్ ప్రధానమంత్రి పుమియో కిషిడా ప్రకటన
ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధంలో ఇప్పటికే 40 వేలు దాటినా మరణాలు
BUSINESS NEWS
రుణాలపై వడ్డీరేట్లు పెంచిన ఎస్సీఐ. .10 బేసీస్ పాయింట్లు పెంపు. వరుసగా మూడో నెలలో వడ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ
ఖనిజాలు, భూముల పై రాష్ట్రాలకే హక్కు ఉంటుందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో… దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలను రాష్ట్రాలకు కేంద్రం చెల్లించాల్సి రావచ్చని అంచనా.
ఓలా నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్ … ప్రారంభ ధర 79 వేలు
SPORTS NEWS
యూఎస్ ఓపెన్ న్యూయార్క్‌లో ఆగస్టు 26న మొదలు కానుంది. సెప్టెంబర్ 8వ తేదిన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
పారిస్ ఒలింపిక్స్ పతక విజేతలతో మోదీ భేటీ.. ప్రధానికి ప్రత్యేక బహుమతి ఇచ్చిన హాకీ జట్టు.
కారణం చెప్పకుండానే కాస్ తీర్పు.. సీఏఎస్‌పై వినేశ్ న్యాయవాది మండిపాటు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి అథ్లెట్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. క్రికెటర్ల కోసం కొత్తగా నిర్మించిన జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) లో అథ్లెట్లకు ప్రాక్టీస్ చేసుకునే అవకాశమిస్తామని చెప్పింది.
యూఈఎఫ్ఏ సూపర్ కప్ ఫైనల్లో ఎంబాపే నేతృత్వంలోని రియల్ మాడ్రిడ్ 2-0తో అట్లాంటాపై జయకేతనం ఎగురవేసింది.
దులీఫ్ ట్రోఫీ నూతన ఫార్మాట్ లో… 4 జట్లతో రౌండ్ రాబిన్ పద్దతిలో టోర్నీ… టేబుల్ టాపర్ విజేత
EDUCATION & JOBS UPDATES
ఆగస్టు 19 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో విడత ఇంజనీరింగ్ నిర్వహించనున్నారు.
ఆగస్టు 22 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ రెండో విడత ప్రవేశాల కొరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
RRB 1376 పారా మెడికల్ ఉద్యగ నోటిఫికేషన్
జాబ్ కేలండర్ షెడ్యూల్ ప్రకారం ఉద్యోగాల భర్తీ – టిజీపీఎస్సీ చైర్మన్
ఆగస్టు 20న ఏపీ ఐసెట్ సీట్ ఎలాట్మెంట్ ఫలితాలు
ఉద్యోగం చేస్తూ చదువుకోవడానికి రాత్రి కళాశాలలకు ఎఐసిటీఈ అనుమతి