BIKKI NEWS (DEC 15) : TODAY NEWS IN TELUGU on 15th DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 15th DECEMBER 2024
TELANGANA NEWS
నేడు, రేపు గ్రూప్ – 2 రాత పరీక్షలు. పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి.
గురుకులాల్లో కామన్ డైట్ అమలు. – సీఎం
మాదిగలకు న్యాయం చేస్తాం, కురుమలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాం – సీఎం
చట్టానికి కట్టుబడి ఉంటా, భాదితురాలి కుటుంబాన్ని కలుస్తా. – జైలు నుండి విడుదలైన అల్లు అర్జున్.
మత్స్య సంఘాల ఎన్నికలు నిర్వహించండి. – హైకోర్టు
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వజూపిన రూ.కోటి నగదు పారితోషికం, ఇంటిజాగను ప్రముఖ కవి నందిని సిధారెడ్డి తిరస్కరించడం తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో మైలురాయిగా నిలుస్తుందని కేటీఆర్ కొనియాడారు.
దక్షిణ మధ్య రైల్వేకు ఆరు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు వచ్చినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు
రోడ్డు విస్తరణ పనుల కోసం జానారెడ్డి, బాలకృష్ణ ల ఇంటికే మార్కింగ్.
ANDHRA PRADESH NEWS
జమిలి ఎన్నికలు అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ కు భారతరత్న సాధిస్తాం – బాబు
వైసీపీ కీలక నిర్ణయం.. ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికలకు దూరం
సినీనటుడు అల్లు అర్జున్‌ను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు
NATIONAL NEWS
మన దేశం ప్రజాస్వామ్యానికి మాత.. లోక్‌సభలో ప్రధాని మోదీ
డిసెంబర్ 16న జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్రం.
ప్రజలకు తాము అభయముద్ర గురించి చెబుతుంటే.. ప్రభుత్వం మాత్రం వారి బొటనవేళ్లను నరుకుతామంటోందని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో వ్యాఖ్యానించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ… భారత దేశ ప్రాచీన ప్రజాస్వామిక మూలాలు ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. మన ఐక్యతకు ప్రాతిపదిక మన రాజ్యాంగమేనన్నారు. నెహ్రూ కుటుంబం రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచనకు బీజం వేసిందని ఆరోపించారు.
రైతులకు తాకట్టు లేకుండా రూ.2 లక్షల వరకు రుణాన్ని అందించే నిర్ణయాన్ని వచ్చే ఏడాది జనవరి 1 నుంచే అమలు చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది.
ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు జూన్ 14 – 2025 వరకు పొడిగింపు
పంజాబ్, హర్యానా రాష్ర్టాల సరిహద్దుల్లోని శంభూ పాయింట్ వద్ద హర్యానా భద్రతా సిబ్బంది శనివారం రైతుల పాదయాత్రపై బాష్పవాయు గోళాలు ప్రయోగించాలి. దీంతో కొందరు రైతులు గాయపడ్డారు.
పారాసిటమాల్‌తో వృద్ధుల గుండె, కిడ్నీలకు చేటు
బీజేపీ అగ్ర నేత అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు.
INTERNATIONAL NEWS
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై అభిశంసన తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ 204-85 ఓట్లతో ఆమోదించింది.
ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ ఆత్మహత్య చేసుకున్నాడు. శాన్‌ఫ్రాన్సిస్‌కోలో 26 ఏళ్ల ఆ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించాడు
కీలకమైన పత్రాలను మరోసారి సమర్పించాలని అధికారులు ఆదేశించడంతో కెనడాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
BUSINESS NEWS
యూపీఐ చెల్లింపులు గత 11 నెలల్లో రూ.223 లక్షల కోట్ల పేమెంట్స్
వచ్చే ఏడాదిలో బంగారం ధరలు నెమ్మదించవచ్చని ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది.
SPORTS NEWS
బ్రిస్బేన్ టెస్టులో తొలి రోజు ఆట వర్షర్పాణం. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 28/0
మహిళల హాకీ జూనియర్ ఆసియకప్‌లో భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో భారత్ తలపడుతుంది.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ముంబై, మధ్యప్రదేశ్ మధ్య ఫైనల్ జరుగనుంది.
EDUCATION & JOBS UPDATES
నేడు, రేపు గ్రూప్ 2 రాత పరీక్షలు
మార్చి నాటికి గ్రూప్ 1,2, 3 ఫలితాలు విడుదల. -బుర్రా వెంకటేశం
SSC 46,617 కానిస్టేబుల్ (జీడీ) తుది ఫలితాలు విడుదల.
సెంట్రల్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ లో భారీ వేతనంతో ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీ లో హవల్దార్, నాయబ్ సుబేదార్ పోస్టులకు నోటిఫికేషన్
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్