TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 14 – 12 – 2024

BIKKI NEWS (DEC 14) : TODAY NEWS IN TELUGU on 14th DECEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 14th DECEMBER 2024

TELANGANA NEWS

అల్లు అర్జున్ అరెస్ట్. రిమాండ్. బెయిల్ పై విడుదల

చట్టం తన పని తాను చేస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధు లు, అధికారులు నేడు తనిఖీలు నిర్వహించనున్నారు.

వెనుక‌బ‌డిన జిల్లాల‌కు ప్ర‌త్యేక సాయం చేయండి.. నిర్మ‌ల‌మ్మ‌కు రేవంత్ రెడ్డి విన‌తి

2030 నాటికి 20 గిగావాట్ల గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు

ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి ఏకసభ్య కమిషన్‌కు సంఘాల వినతి

పీఆర్సీ నివేదికను త్వరగా తెప్పించుకుని 40 శాతం ఫిట్మెంట్‌ను ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం (టీఈఏ) ప్రభుత్వాన్ని కోరింది.

భూదాన్‌ భూముల వ్యవహారం.. మాజీ ఎమ్మెల్యే సహా నలుగురికి ఈడీ నోటీసులు

ఢిల్లీ పర్యటన సందర్భంగా క్యాబినెట్‌ విస్తరణపై పార్టీ పెద్దలతో ఎటువంటి చర్చ జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

ANDHRA PRADESH NEWS

స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు

అల్లు అర్జున్‌ అరెస్టును వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్‌ ఖండించారు.

కడప వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి అరెస్ట్‌ .. దద్దమ్మ రాజకీయాలు ఆడుతున్నారని మండిపాటు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వానలు కురిసే అవకాశం..

NATIONAL NEWS

ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ (28), రోషిణీ నాడార్‌ మల్హోత్రా (81వ ర్యాంక్‌), కిరణ్‌ మజుందార్‌ షా (91వ ర్యాంక్‌)లు చోటు దక్కించుకున్నారు.

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు డబ్బు విత్‌డ్రా కోసం ప్రత్యేక కార్డులు

సరిహద్దు వద్ద నిరసనకు దిగిన రైతులు హింసాత్మక చర్యలకు దిగకుండా గాంధేయ మార్గాన్ని అనుసరించాలని సుప్రీంకోర్టు కోరింది.

రాజ్యాంగం విధ్వంసానికి వాళ్లు చేయని ప్రయత్నం లేదు.. కేంద్రంపై లోక్‌సభలో ప్రియాంకాగాంధీ ఫైర్‌

ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపులు.. రష్యన్‌ భాషలో మెయిల్‌

మహానది జల వివాదాల ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా జస్టిస్‌ బేలా ఎం త్రివేది నియమితులయ్యా రు

INTERNATIONAL NEWS

ఫోర్బ్స్‌ (Forbes) విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో వరుసగా ఆరోసారి నిర్మలా సీతారామన్ చోటు సాధించారు.

అమెరికా నుంచి పంపించాల్సిన 15 లక్షల మంది జాబితాను యూఎస్‌ ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) సిద్ధం చేసింది.

ఫ్రాన్స్‌ తదుపరి ప్రధానిగా తన మధ్యేవాద మిత్రపక్ష సభ్యుడు ఫ్రాంకోయిస్‌ బేరోను ఎంపిక చేసినట్లు అధ్యక్షుడు ఇమాన్యుయల్‌ మాక్రాన్‌ శుక్రవారం ప్రకటించారు.

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ దాడికి పాల్పడింది. రాజధాని కీవ్‌తో పాటు పలు ప్రాంతాలపై డజన్ల కొద్దీ క్రూయిజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లతో దండెత్తింది.

BUSINESS NEWS

భారీ నష్టాలనుండి లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

సెన్సెక్స్ : 82,133.12 (843.16)
నిఫ్టీ : 24,768.30 (219.60)

654.85 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు

తులం పుత్తడి రూ.1,400 తగ్గి రూ.79,500కి దిగొచ్చింది.

SPORTS NEWS

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ముంబై, మధ్యప్రదేశ్‌ ఫైనల్లోకి చేరుకున్నాయి.

నేటి నుంచి గబ్బా వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మూడో టెస్టు

ప్రతిష్ఠాత్మక చెస్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ విజేతగా నిలిచిన యువ ప్లేయర్‌ దొమ్మరాజు గుకేశ్‌ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల నజరానా ప్రకటించింది.

EDUCATION & JOBS UPDATES

నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల

SSC CHSL పెరిగిన పోస్టుల సంఖ్య

ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 01 వరకు ఫిజికల్ టెస్ట్స్

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు