TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 13 – 09 – 2024

BIKKI NEWS (SEP. 13) : TODAY NEWS IN TELUGU on 13th SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 13th SEPTEMBER 2024

TELANGANA NEWS

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని మండిపడ్డారు.

బీఆఎర్‌ఎస్‌ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడి ఘటనలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహా 15 మంది ఆయన అనుచరులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు.

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడిని సీఎం రేవంత్‌రెడ్డే చేయించారని బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

గురుకులాల్లో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేకుంటే దశలవారీగా ఆందోళనలు చేపడుతామని రాష్ట్ర సర్కారుకు టీఎస్‌యూటీఎఫ్‌, గురుకుల జేఏసీ అల్టిమేటం జారీ చేసింది.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరణ తీర్పుపై అధ్యయనం, సిఫారసులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసింది.

ఆర్టీసీ జేఏసీ ఒత్తిడికి ఆర్టీసీ యాజమాన్యం దిగొచ్చి, పండుగ అడ్వాన్స్‌ చెల్లించడానికి అంగీకరించింది.

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకే ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌ పదవి ఇచ్చినట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణ మోడల్‌ సూల్‌ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను రూపొందించి, 2023 నాటి మార్గదర్శకాల ప్రకారం బదిలీలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.

తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని తెలిపింది.

నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌ మధ్య వందే భారత్‌.. 14న గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్న ప్రధాని మోదీ.

నాపై హత్యాయత్నం.. ప్లాన్‌ ప్రకారమే గూండాలతో దాడి‌: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి

ఆకాశానికి ఎగిసిన గురుకులాలను అధోపాతాళానికి తొక్కుతున్నారు.. రేవంత్ స‌ర్కార్‌పై ఆర్ఎస్పీ ధ్వ‌జం.

ANDHRA PRADESH NEWS

తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే విజయవాడకు వరదలు వచ్చాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువును ఈనెల 15 నుంచి మరో వారం రోజుల వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. దసరా, దీపావళి పండుగ సందర్భంగా 24 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది.

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో కారులో ఉన్న నలుగురు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

NATIONAL NEWS

ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు.

వైద్య పరిశోధనల కోసం.. ఎయిమ్స్‌కే సీతారాం ఏచూరి పార్థీవదేహం..!

చైనాతో దాదాపు 75శాతం సమస్యలు పరిష్కామయ్యాయని.. సరిహద్దుల్లో సైనికీకరణ పెరగడం పెద్ద సమస్యగా విదేశాంగ మంత్రి జైశంకర్‌ అభివర్ణించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో ఇద్దరు గ్రామస్థులను నక్సలైట్లు ఉరి తీశారు.

బుల్డోజర్‌ న్యాయంపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ కట్టడాల పేరుతో ప్రజల ఇండ్లపైకి ప్రభుత్వాలు బుల్డోజర్లను పంపిస్తుండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. క్రిమినల్‌ కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉండటం ఆ నిందితుల ఇండ్ల కూల్చివేతకు తగిన కారణం కాబోదని స్పష్టం చేసింది.

శ్రీరామ జన్మభూమి అయోధ్యలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు

సీజేఐ చంద్రచూడ్‌ నివాసంలో జరిగిన గణపతి పూజకు ప్రధాని మోదీ హాజరవడం వివాదాస్పదమైంది. సీజేఐ పక్షపాత వైఖరిని విపక్షాలు ప్రశ్నించాయి

ఇక నైరుతి రుతుపవనాల ఉపసంహరణ..! అక్టోబర్‌ 15 నాటికి తిరోగమనం

డాక్టర్లతో చర్చల కోసం రెండు గంటలు వేచి చూశా.. రాజీనామాకు సిద్ధం: మమతా బెనర్జీ

మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ప్రభుత్వ ఆసుపత్రికి నిప్పు

INTERNATIONAL NEWS

అప్పట్లో అదానీ గ్రూప్‌తో జరుపుకున్న విద్యుత్తు ఒప్పందాన్ని నిశితంగా పరిశీలించాలని మహమ్మద్‌ యూనస్‌ ప్రభుత్వం నిర్ణయించింది

బిలియ‌నీర్ జేర్డ్ ఇజాక్‌మాన్‌.. నాన్ ప్రొఫెస‌న‌ల్ స్పేస్‌వాక్‌లో పాల్గొన్నారు. ఆయ‌న‌తో పాటు మ‌రో ముగ్గురు కూడా స్పేస్‌వాక్ చేశారు

ఇప్పటివరకు పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌లతోపాటు, భవిష్యత్తులో వచ్చే వేరియెంట్స్‌ అన్నింటినీ ఎదుర్కొనే నానో వ్యాక్సిన్‌ను తయారుచేసినట్టు ‘వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ’ సైంటిస్టులు తాజాగా ప్రకటించారు.

చైనాతో పాటు ఇరాన్‌, యూఏఈ, ఖతార్‌, సిరియా, ఉత్తర కొరియా ఉన్నాయి. ఈ దేశాలు తమ దేశాల్లో వాట్సాప్ వాడకాన్ని నిషేధించాయి.

లాయిల్ విల్‌కాక్స్ సైకిల్‌పై ప్ర‌పంచాన్ని చుట్టేసింది. 108 రోజులు, 12 గంట‌లు, 12 నిమిషాల్లో ఆ జ‌ర్నీ పూర్తి చేసింది. అతి త‌క్కువ స‌మ‌యంలో ఆ ఫీట్ అందుకున్న మ‌హిళా సైక్లిస్టుగా రికార్డుకెక్కింది.

BUSINESS NEWS

తొలిసారి 83,000కు సెన్సెక్స్‌

సెన్సెక్స్ : 82,963 (1439)
నిఫ్టీ : 25,389 (470)

వెండి ధరలు గురువారం భారీ ఎత్తున పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఒక్కరోజే కిలో రూ.2,000 ఎగబాకి రూ.87,000 పలికింది

24 క్యారెట్‌ తులం రూ.250 దిగి రూ.74,350గా ఉన్నది. 22 క్యారెట్‌ రూ.74,000గా నమోదైంది.

దేశీయ పారిశ్రామికోత్పత్తి మందగించింది. ఈ ఏడాది జూలైలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 4.8 శాతానికే పరిమితమైంది. నిరుడు జూలైలో 6.2 శాతంగా ఉండటం గమనార్హం.

ఆగస్టు నెల రిటైల్ ద్రవ్యోల్బణం దిగి వచ్చింది. గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం 3.65 శాతానికి చేరుకుంది.

ఆహార ద్రవ్యోల్బణం మాత్రం జూలై నెలతో పోలిస్తే 5.42 నుంచి 5.66 శాతానికి పెరగడం గమనార్హం.

బ్యాంకులకు వరుసగా ఆరు రోజులు సెలవులు..! ఏమైనా పనులుంటే ముందే చక్కబెట్టుకోండి..!

త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ పేర్కొన్నారు.

SPORTS NEWS

బెల్జియంలోని బ్రస్సెల్స్‌ వేదికగా శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో అథ్లెట్లు మరోసారి తమ విన్యాసాలతో అలరించనున్నారు. 32 క్రీడాంశాలలో వందలాది మంది స్టార్‌ అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు.

మంగళూరు(కర్నాటక) వేదికగా జరుగుతున్న 77వ జాతీయ సీనియర్‌ అక్వాటిక్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన వేర్వేరు విభాగపు పోటీల్లో వ్రితి స్వర్ణ, రజత పతకాలతో మెరిసింది.

ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీలో అజేయంగా దూసుకెళ్తున్న భార‌త పురుషుల హాకీ జ‌ట్టు ఫైన‌ల్ బెర్తు కోసం పాకిస్థాన్‌ తో సెమీస్ లో త‌ల‌ప‌డ‌నుంది.

భార‌త పారా అథ్లెట్ల‌ను ప్ర‌ధాని మోదీ ప్ర‌శంసించారు. ఇవాళ ఆయ‌న త‌న నివాసంలో ఆ అథ్లెట్ల‌ను క‌లిశారు. ఆ క్రీడాకారుల‌కు ఆయ‌న కంగ్రాట్స్ తెలిపారు.

EDUCATION & JOBS UPDATES

తెలంగాణ యాంటీ నారోటిక్‌ బ్యూరోలో స్పెషల్‌ పోలీ స్‌ ఆఫీసర్‌ (డ్రైవర్‌)ల నియామకానికి దరఖాస్తులు ఆ హ్వానిస్తూ టీజీ న్యాబ్‌ అధికారులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచింగ్ సిబ్బంది నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్

మహబూబాద్ వైద్య కళాశాలలో కాంట్రాక్టు పద్దతిలో 106 ఉద్యోగాలకు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండర్ గ్రాడ్యుయోట్ కోర్సులకు ఉమ్మడి అకడమిక్ కేలండర్ ను విడుదల చేసింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు