TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 13 – 11 – 2024

BIKKI NEWS (NOV. 13) : TODAY NEWS IN TELUGU on 13th NOVEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 13th NOVEMBER 2024

TELANGANA NEWS

బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కేసులో మంగళవారం హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పు ను రిజర్వ్ చేసింది.

నాలుగు రోజుల పర్యటన కోసం గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దంపతులు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు

స్టార్టప్‌ల పెట్టుబడులకు టీ-హబ్‌ దేశంలోనే అత్యుత్తమ పాలసీగా ఉందని సీఎం కొనియాడారు.

వికారాబాద్‌ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్‌, ఇతర అధికారులపై జరిగిన దాడికి నిరసనగా ట్రెసా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉద్యోగుల నిరసనలు కొనసాగాయి.

తెలంగాణలో కొత్తగా 4 డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు

తెలంగాణ సెక్రటేరియట్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (టీజీఎస్‌వోఏ) ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 18న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారి ఎన్‌ శంకర్‌ తెలిపారు.

మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు వేసిన పరువునష్టం దావాలో సాక్షుల వాంగ్మూలాల్ని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం నమోదు చేయనుంది

ANDHRA PRADESH NEWS

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా

కార్తీక మాసం సందర్భంగా ఈనెల 18వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఏపీ పరిణామాలపై జోక్యం చేసుకోవాలని మానవహక్కుల సంఘానికి వైసీపీ ఫిర్యాదు

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని, కేసు విచారణను హైదరాబాద్‌ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని కోరుతూ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును నవంబర్ 21 వరకు పొడిగించారు.

చంద్రబాబు ఎన్ని కేసులు పెట్టినా భయపడం.. మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

NATIONAL NEWS

భారత్‌కు చెందిన తృష్ణా రే ‘మిస్‌ టీన్‌ యూనివర్స్‌-2024’ కిరీటాన్ని దక్కించుకున్నారు.

వెయ్యి మందికి పైగా మహిళా సిబ్బంది కలిగిన మొట్టమొదటి పూర్తి మహిళా సీఐఎస్‌ఎఫ్‌ రిజర్వ్‌ బెటాలియన్‌ను కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో మంజూరు చేసింది.

డోర్‌ డెలివరీ చేసే ఆహార ఉత్పత్తుల కనీస కాల పరిమితి(షెల్ఫ్‌ లైఫ్‌) విషయంలో స్విగ్గీ, జొమాటో వంటి ఈ-కామర్స్‌ ఫుడ్‌ బిజినెస్‌ ఆపరేటర్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.

గర్భధారణ సమయంలో, బాల్యం ప్రారంభంలో గాలి కాలుష్యానికి గురైతే, పిల్లలు ఆటిజం (మందబుద్ధి) బారినపడే ముప్పు ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది.

ఎంట్రన్స్ పరీక్షల్లో సంస్కరణలు.. రాష్ట్రాలు సహకరించాలన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఒడిశా తీరం చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (LRLACM) తొలి ఫ్లయిట్‌ టెస్ట్‌ని విజయవంతంగా నిర్వహించింది.

దేశాన్ని ప్రపంచానికి డ్రోన్ హబ్‌గా మార్చడమే లక్ష్యం : రాజ్‌నాథ్ సింగ్

సైన్యం ప్రచండ హెలికాప్టర్‌ ను అత్యంత ఎత్తులో విజయవంతంగా పరీక్షించింది. ఈ హెలికాప్టర్‌ భారత్‌లోనే తయారుకావడం విశేషం.

ట్ర‌క్కును ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఇన్నోవా కారులోని ఆరుగురు విద్యార్థులు మ‌ర‌ణించారు. డెహ్రాడూన్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

INTERNATIONAL NEWS

టర్రిటోప్సిస్‌ డోర్నీ అనే ఒక రకమైన జెల్లీషిష్‌ కు మరణం లేదు. వయసును రివర్స్‌ చేసుకొనే అసాధారణ సామర్థ్యం ఈ సముద్ర జీవికి ఉంది.

సోలార్‌ యాక్టివిటీ అధికమవుతున్నదని, ఫలితంగా దిగువ భూకక్ష్యలోని ఉపగ్రహాలకు ముప్పు పెరుగుతున్నదని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

చైనాలోని జుహాయ్‌ నగరంలో ఓ క్రీడల కేంద్రంపైకి కారు దూసుకెళ్లడంతో 35 మంది మృతి చెందారని, 43 మంది గాయపడ్డారని ఆ దేశ పోలీసులు సోమవారం వెల్లడించారు.

చైనాలోని జుహాయ్‌ నగరంలో ఓ క్రీడల కేంద్రంపైకి కారు దూసుకెళ్లడంతో 35 మంది మృతి చెందారని, 43 మంది గాయపడ్డారని ఆ దేశ పోలీసులు సోమవారం వెల్లడించారు.

అమెరికా తదుపరి జాతీయ భద్రతా సలహాదారుగా కాంగ్రెస్‌ సభ్యుడు మైక్‌ వాల్జ్‌ ను ట్రంప్‌ నియమించినట్లు తెలిసింది.

BUSINESS NEWS

కుప్పకూలిన స్టాక్ మార్కెట్

సెన్సెక్స్ : 78,675 (-950)
నిఫ్టీ : 23,883 (-258)

అక్టోబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 6.21 శాతంగా నమోదైంది.

అక్టోబర్‌లో వినియోగదారుల ఆహార ధరల సూచీ (సీఎఫ్‌పీఐ) ఒక్కసారిగా 10.87 శాతానికి చేరింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి 3.1 శాతానికి పెరిగింది

హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్‌ తులం బంగారం ధర రూ.1,470 తగ్గి రూ.77,290కి దిగొచ్చింది.

ఢిల్లీలో కిలో వెండి రూ.2,700 తగ్గి రూ.91,300కి తగ్గింది.

దేశంలో గోధుమల ధరల పెరుగుతున్నది. మార్కెట్‌లో రికార్డుస్థాయిలో టన్ను రూ.34వేలకు చేరుకున్నది.

SPORTS NEWS

మహిళల ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ (ఏసీటీ)లో భారత హాకీ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 3-2తో దక్షిణ కొరియాపై గెలిచింది.

ఐసీసీ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్’ అక్టోబర్ 2024 అవార్డు విజేత‌ల‌ను ప్ర‌క‌టించింది. పురుషుల విభాగంలో పాకిస్థాన్ స్పిన్న‌ర్ నొమ‌న్ ఆలీ, మహిళల కేట‌గిరీలో అమేలియా కేర్ అవార్డుకు ఎంపిక‌య్యారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌ మునాఫ్‌ పటేల్‌ ఎంపికయ్యాడు

‘బీసీసీఐ అభ్యంత‌రాలు ఏంటో చెప్పండి?’.. ఐసీసీని కోరిన పాక్ బోర్డు

EDUCATION & JOBS UPDATES

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరి 23 కి వాయిదా.

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు నవంబర్ 21 వరకు పొడిగించారు.

పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌, ఐటీఐల మాదిరిగా డిగ్రీలోనూ ప్రతి మూడు, నాలుగేండ్ల కొకసారి సిలబస్‌లో మార్పులు చేర్పులు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తున్నది.

పోస్టల్ జీడీఎస్ 4వ విడత మెరిట్ లిస్ట్ విడుదల

ఆర్మీ స్కూల్ టీచర్ అడ్మిట్ కార్డులు విడుదల. నవంబర్ 23, 24 న పరీక్షలు

గెయిల్ లో లక్షకు పైగా వేతనం తో 261 ఉద్యోగాలు

GATE 2025 పరీక్షలను ఫిబ్రవరి 1,2, 15, 16 వ.తేదీలలో నిర్వహించనున్నారు.

BDL లో 150 ఖాళీల భర్తి కొరకు ప్రకటన

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో 802 డిప్లోమా ట్రైనీ ఖాళీల భర్తీ కొరకు ప్రకటన

ఏపీ లో బీసీ స్టడీ సర్కిల్ లలో ఉచిత డీఎస్సీ కోచింగ్.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు