BIKKI NEWS (SEP. 12) : TODAY NEWS IN TELUGU on 12th SEPTEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 12th SEPTEMBER 2024
TELANGANA NEWS
పోలీసుల పిల్లలకు ఆరో తరగతి నుంచి పీజీ వరకు నాణ్యమైన, ఉచిత విద్యను అందించేందుకు సైనిక్‌సూల్ తరహాలో పోలీస్ రెసిడెన్షియల్ సూల్స్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
గ్రేటర్‌లో మరిన్ని పేదల ఇండ్లపై హైడ్రా బుల్డోజర్‌తో దాడి చేయనున్నట్టు సమాచారం. 46 ఏండ్ల నుంచి నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇండ్లలో నివాసం ఉండే వారిపై హైడ్రా చర్యలు తీసుకోబోదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల వెల్లడించారు.
మూసీ ప్రక్షాళనలో ఇండ్లు కోల్పోయే 11-14 వేల మందికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని సీఎం చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు
రాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్షనేతగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారిని గుర్తిస్తున్నట్టుగా శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు గెజిట్ విడుదల చేశారు.
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఐదు యూనిట్ల ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు ఉపముఖ్య మంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ గాలిలో దీపంలా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తక్షణమే విద్యాశాఖపై ఉన్నతస్థాయి సమీక్షి నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని ఎక్స్ వేదికగా బుధవారం డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కుక్క కాట్లకు చిన్నారులు బలవుతున్నా కాంగ్రెస్ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేకపోవటం దుర్మార్గమని మాజీమంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని పోటీపరీక్షలు సహా ఎస్‌సెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న కోచింగ్ సెంటర్లపై సర్కారు కొరడా ఝలిపించనున్నది. నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోనున్నది. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అమలుచేయాలని క్యాబినెట్ సబ్‌కమిటీ నిర్ణయం తీసుకున్నది.
అటవీ శాఖ అమరవీరుల స్ఫూర్తిగా అడవులను రక్షించుకుందామని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు.
ఈ నెల 25న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు లక్షలాది మంది బీసీలతో కులగణన మార్చ్ చేపడుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ లో బదిలీ ప్రక్రియ అంతు చిక్కడం లేదు. సొసైటీలోని నాలుగో తరగతి ఉద్యోగులకు గత జూలై 31న బదిలీల ప్రక్రియను పూర్తి చేసినా ఇప్పటివరకు ఉత్తర్వులను మాత్రం ఇవ్వడం లేదు.
ఉద్యోగుల వేతనాలు, బిల్లులు చెల్లించేందుకు వినియోగిస్తున్న ఈ కుబేర్‌ను రద్దుచేయాలని, ట్రెజరీ ద్వారానే పాత విధానంలో ఉద్యోగుల బిల్లులను చెల్లించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది.
హైదరాబాద్‌లో హైడ్రా పనితీరు బాగుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రశంసించారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని బుధవారం కలిశారు.
నాలుగు శతాబ్దాల నాటి గోండ్వానా కాలం జీవరాశులను సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు.
ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్.. జాగ్రత్తగా ఉండాలన్న వీసీ సజ్జనార్
ప్రభావిత ప్రాంతాల్లో సంభవించిన వరద నష్టంపై కేంద్ర బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నివేదించారు.
ANDHRA PRADESH NEWS
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. జగన్ పాస్ పోర్టు రెన్యువల్‌ను ఐదేళ్లకు పెంచాలని అధికారులను ఆదేశించింది.
ఏపీలో ఎక్సైజ్ నేరాలను అరికట్టేందుకు ఏర్పాటుచేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ప్రభుత్వం రద్దు చేసింది.
ఏపీలో అక్టోబర్ నుంచి నూతన మద్యం పాలసీ : మంత్రి కొల్లు రవీంద్ర
ప్రజల అవసరాలను గుర్తించగలిగే సామర్థ్యం ఏపీ ప్రభుత్వానికి లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు.
ఏపీలో టీడీపీ నాయకులు అమలు చేస్తున్న రెడ్ బుక్ మీకే సొంతమని అనుకోవద్దని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం చిలకవారిపాకల సమీపంలో అదుపుతప్పి మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు.
NATIONAL NEWS
దేశంలో 70 ఏండ్లు పైడిన అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వర్తింపజేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఎలక్ట్రిక్ బస్సులు, ఆంబులెన్సులు, ట్రక్కులు సహా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రూ.10,900 కోట్లతో రెండేండ్ల పాటు పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు తెలిపారు.
2024-25 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన-4 అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
దేశంలో రానున్న ఎనిమిదేండ్లలో 31,350 మెగావాట్లతో నూతన జల విద్యుత్తు కేంద్రాల నిర్మాణానికి రూ.12,461 కోట్లు కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు చెప్పారు.
ఆధార్ కార్డులో పొరపాట్లను ఫ్రీగా అప్‌డేట్ చేసుకునేందుకు 14 వరకు గడువు ఇచ్చారు. ఆధార్ అప్‌డేట్‌కు గుర్తింపు, చిరునామా రుజువులు సమర్పించాల్సి ఉంటుంది.
ముంబైకు చెందిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ ఇటీవల ఆవిష్కరించిన ‘ప్రెస్‌వు’ ఐ డ్రాప్స్‌కు డీసీజీఐ అనుమతి రద్దు చేసింది. ఈ ఐ డ్రాప్స్‌కు డీసీజీఐ ఆగస్టులో అనుమతి ఇచ్చింది.
ఖలిస్థాన్ అనుకూల సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే)పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేండ్లు పొడిగించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఈ సంస్థపై ఐదేండ్ల క్రితం నిషేధం విధించింది.
అంతుబట్టని ఓ వ్యాధి గుజరాత్‌లో కలకలం రేపుతున్నది. ముఖ్యంగా కచ్ జిల్లాలో లఖ్‌పత్, అబ్దాసా తాలూకాల్లో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది.
భారత తొలి ఏరో స్పైక్ రాకెట్ ఇంజిన్ ప్రయోగం విజయవంతమైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొపల్షన్ టెస్ట్ ఫెసిలిటీలో ఈ ప్రయోగాన్ని స్పేస్‌ఫీల్డ్స్ స్టార్టప్ విజయవంతంగా పరీక్షించింది.
నీరవ్ మోదీ రూ.29.75కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
పదేండ్లలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ సెప్టెంబర్ 25 వరకూ పొడిగింపు
ఎలక్ట్రానిక్స్ రంగంలో అందుబాటులోకి రానున్న 60 లక్షల ఉద్యోగాలు : మోదీ
మరోసారి ఇజ్రాయెల్‌కు మన కార్మికులు.. రూ.2లక్షల వేతనంతో 15 వేల ఉద్యోగాలకు ఆహ్వానం
INTERNATIONAL NEWS
పొరుగు దేశం పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం 12:58 గంటల సమయంలో 5.8 తీవ్రతతో భూమి కంపించింది.
కెన్యాలో అదానీ సంస్థకు వ్యతిరేకంగా వందలాది మంది ఎయిర్‌పోర్టు కార్మికులు ఆందోళనకు దిగారు.
నవంబర్‌లో జరిగే అగ్రరాజ్య ఎన్నికల సందర్భంగా జరిగిన డిబేట్‌లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్ట్ ట్రంప్ తొలిసారిగా ముఖాముఖీ తలపడ్డారు.
అమెరికాలోని షికాగోలో చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించిన నిర్దోషికి దాదాపు రూ.420 కోట్ల పరిహారం దక్కనుంది.
వియత్నాంలో విషాదం.. 140 మందిని బలిగొన్న యాగీ టైఫూన్
BUSINESS NEWS
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
సెన్సెక్స్ : 81,523 (-398)
నిఫ్టీ : 24,918 (-123)
ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చైర్‌పర్సన్ మాధబి పూరి బుచ్‌పై కొత్తగా వచ్చిన ఆరోపణలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సెక్యూరిటీస్ స్పందించింది. ఆరోపణలపై మాత్రం ఆమె స్పందించడం లేదని అమెరికా సంస్థ పేర్కొన్నది
రాష్ట్రాన్ని ఉత్పాదక రంగంలో అగ్రగామిలా నిలిపేలా ‘మేకిన్ తెలంగాణ’ భావనను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పారిశ్రామిక రంగానికి పిలుపునిచ్చారు.
భారతీయ మార్కెట్‌కు గుడ్‌బై చెప్పిన అగ్రరాజ్యం ఆటో దిగ్గజం ఫోర్డ్.. త్వరలోనే రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెండు రోజుల్లో పుత్తడి ధర రూ.1,000 ఎగబాకింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం ధర మరో రూ.500 పెరిగి రూ.74,600 పలికింది.
ఎంజీ మోటార్స్ భారత మార్కెట్‌లోకి మరో ఈవీ కార్‌ను బుధవారం లాంచ్ చేసింది. ఈ ఈవీ కార్ రూ.9.99లక్షల ప్రారంభ ధరతో కంపెనీ విడుదల చేసింది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ – 2024’ సేల్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది
SPORTS NEWS
ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ జోరు కొనసాగిస్తోంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఈ టోర్నీలో సెమీస్‌కు అర్హత సాధించింది.
హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆల్‌ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ టోర్నీలో విజేతగా నిలిచింది.
సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ అథ్లెట్ వినోద్ వెండి వెలుగులు విరజిమ్మాడు. బుధవారం జరిగిన పురుషుల 800మీటర్ల రేసును వినోద్ 1:50:07సెకన్లలో ముగించి రెండో స్థానంతో రజత పతకం సొంతం చేసుకున్నాడు.
పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా తనకు భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) చీఫ్ పీటీ ఉష నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ తీవ్ర విమర్శలు చేసింది
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోమిత్ శర్మ టాప్-5లో చోటు దక్కించుకున్నాడు.
EDUCATION & JOBS UPDATES
తెలంగాణ డీఎస్సీ దరఖాస్తులో టెట్ మార్కుల ఎడిట్‌కు 12, 12వ తేదీలలో అవకాశం.. 13 తర్వాత సవరణకు వీల్లేదు.
తెలంగాణ కేజీబీవీలలో 1000 పోస్టుల భర్తీ కి చర్యలు
వైద్యారోగ్య శాఖలో త్వరలోనే 4 వేల ఉద్యోగాల భర్తీ కి చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
తెలంగాణ పీజీఈసెట్ 2024 తొల విడత సీట్ల కేటాయింపు.
టీజీ అగ్రిసెట్ 2024 ఫలితాలు విడుదల
SSC GD కానిస్టేబుల్ 2023 నోటిఫికేషన్ కు సంబంధించిన ఈవెంట్స్ షెడ్యూల్ విడుదల చేసింది.