TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 11 – 09 – 2024

BIKKI NEWS (SEP. 11) : TODAY NEWS IN TELUGU on 11th SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 11th SEPTEMBER 2024

TELANGANA NEWS

వీధి కుక్కలు పది నెలల చిన్నారిపై దాడి చేసి చంపేశాయి. చిన్నారి మృతదేహాన్ని అత్యంత కిరాతకంగా పీక్కుతిన్నాయి. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.

రుణాల రీస్ట్రక్చరింగ్‌కు అవకాశం ఇవ్వాలని లేకుంటే రాష్ర్టానికి అదనపు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది.

సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా కులగణన జరగాలని హైకోర్టు పేర్కొన్నది. వికాస్‌కిషన్‌రావ్‌ గావ్లీ వర్సెస్‌ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బీసీల సమకాలీన, అనుభావిక పరిశీలన జరగాలని తెలిపింది.

స్థానిక సంస్థలు ఎన్నికలు ఈ యేడాది లేనట్లే.. ఎన్నికల నిర్వహణకు కీలకమైన బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి రాష్ట్ర ప్రభు త్వం హైకోర్టును మూడు నెలల సమయం అడిగింది. దీంతో ఈ యేడాది స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్లేనని స్పష్టమైంది.

తెలంగాణ ప్రభుత్వం జూలైలో ఏకంగా రూ.10,392 కోట్ల అప్పు చేసింది. తద్వారా గత పదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా ఒకే నెలలో రూ.10 వేల కోట్లకుపైగా అప్పుతో ‘చరిత్ర’ సృష్టించింది

సీఎం రేవంత్‌ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈనెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(టీ)లోని సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాల జ్వరాలతో మంచం పట్టింది. దీంతో అధికారులు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి పిల్లలను ఇండ్లకు పంపిస్తున్నారు.

టీవీవీపీ దవాఖానల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, ఇప్పటికైనా వేతనాలు చెల్లించకుంటే విధులను బహిష్కరించడానికి కూడా వెనుకాడబోమని తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌, వరర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ హెచ్చరించారు.

సైబర్‌ నేరాల అదుపునకు విశేష కృషి చేస్తున్న తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక ‘సమన్వయ ప్లాట్‌ఫామ్‌’ పురస్కారం దక్కింది

కాంగ్రెస్‌ పార్టీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్‌ అమలు కోసం బీసీలంతా పోరాడాలని, కాంగ్రెస్‌ పార్టీ కళ్లు తెరిపించడానికి మిలిటెంట్‌ ఉద్యమాలకు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌ కృష్ణయ్య పిలుపునిచ్చారు.

కోఠి మ‌హిళా యూనివ‌ర్సిటీకి చాక‌లి ఐల‌మ్మ పేరు : సీఎం రేవంత్ రెడ్డి

యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ దరఖాస్తు చేసిన నాలుగు కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఆదేశించింది.

సంసృతాంధ్ర విద్వతవి, అష్టావధాని, దాశరథి అవార్డు గ్రహీత డాక్టర్‌ అయాచితం నటేశ్వర శర్మ (68) క‌న్నుమూశారు

మోడ‌ల్ సోలార్ విలేజ్‌గా కొండారెడ్డిప‌ల్లి.. సీఎం రేవంత్ ఆదేశాల‌తో ఇంటింటి స‌ర్వే

హుస్సేన్‌ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని స్పష్టం చేసింది. మట్టి, ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని క్లారిటీ ఇచ్చింది.

ANDHRA PRADESH NEWS

వైసీపీ నాయకులపై కక్ష తీర్చుకోవడానికే చంద్రబాబు వరద రాజకీయం : అంబటి రాంబాబు

రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే సహించం.. వైసీపీ నాయకులకు చంద్రబాబు హెచ్చరిక

పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి.. హోంమంత్రి అనితపై మండిపడ్డ మేరుగు నాగార్జున

విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి.. మరో ముగ్గురికి గాయాలు

సచివాలయ ఉద్యోగులకూ తప్పని రెడ్‌బుక్‌ వేధింపులు.. నారా లోకేశ్‌పై వైసీపీ తీవ్ర మండిపాటు

ఏపీలో వర్షాలు, వరదలకు 46 మంది మృతి.. అధికారికంగా ప్రభుత్వం వెల్లడి

పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత. వైసీపీ నేతల కాన్వాయ్‌పై టీడీపీ కేడర్‌ దాడి

ప్రకాశం బ్యారేజీ నిందితులు టీడీపీ వాళ్లే.. చంద్రబాబుతో ఉన్న ఫొటోలు షేర్‌ చేసిన వైసీపీ

NATIONAL NEWS

కోల్‌కతా ఆర్‌జీ కర్‌ దవాఖాన హత్యాచార ఘటనపై నిరసన చేపడుతున్న జూనియర్‌ డాక్టర్లు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారు. మంగళవారం ఐదు గంటల్లోపు విధుల్లోకి చేరాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ ఆందోళన కొనసాగించారు

కేదార్‌నాథ్‌ వెళ్లే మార్గంలో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడగా, ఐదుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు

వాహనాల వయసు ఆధారంగా కాకుండా, వాటి నుంచి వెలువడే కాలుష్యం ఆధారంగా తుక్కుగా మార్చాలన్నది కొత్త పాలసీలో కీలక అంశం.

కోచింగ్‌ క్లాసులపై ఇన్ఫోసిన్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి విమర్శలు గుప్పించారు. పరీక్షల్లో పిల్లలు మెరుగ్గా రాణించేందుకు కోచింగ్‌ క్లాసులు సరైనమార్గం కాదని అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధింపుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. మద్యం పాలసీ కేసులో గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ జైలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొన్నదని, రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బీజేపీ ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించడం, దానిని ఆమె కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపడంతో ఈ ఊహాగానాలు మరింత అధికమయ్యాయి.

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతున్నది.

దేశంలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థను తీసుకువచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రయాణ దూరం బట్టి టోల్‌ ఫీజు

కర్ణాటకలోని మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌ఎంట్‌ అథారిటీ (ముడా) కుంభకోణంలో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సహా 18 మంది అధికారులకు మైసూర్‌ లోకాయుక్త నోటీసులు జారీ చేసింది.

ప్రతి గంటకు 53 ప్రమాదాలు.. 19 మరణాలు..! రోడ్డు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నితిన్ గడ్కరీ..!

స్వచ్ఛమైన, పర్యావరణహిత వాహనాలపై ఆటోమేకర్లు దృష్టిసారించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సీనియర్ న్యాయవాదుల ను సుప్రీంకోర్టు లో అదనపు సొలిసిటర్‌ జనరల్‌లుగా నియమించింది.

కొన్ని మ‌తాలు, భాష‌లను ఆర్ఎస్ఎస్ త‌క్కువ‌గా చూస్తోంది: రాహుల్ గాంధీ

INTERNATIONAL NEWS

రష్యాకు ఇరాన్‌ ఆయుధాలు సరఫరా చేస్తున్నదని అమెరికా, బ్రిటన్‌ మంగళవారం ఆరోపించాయి. ఉక్రెయిన్‌పై దాడికి ఉపయోగపడేలా ఇరాన్‌ స్పల్వ శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను రష్యాకు పంపుతున్నదని పేర్కొన్నాయి.

గాజాలోని ఓ రక్షణ గుడారంపై మంగళవారం ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో కనీసం 19 మంది చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

సూర్యకాంతిని ఉపయోగించుకొని మొక్కలు..కార్బన్‌ డయాక్సైడ్‌, నీటిని ఆహారంగా మార్చినట్టు.. విస్తారమైన సౌరశక్తి నుంచి ఇంధనాన్ని తయారుచేయటంలో అమెరికా సైంటిస్టులు సరికొత్త ప్రక్రియను కనుగొన్నారు.

యూఎస్‌ న్యూస్‌ & వరల్డ్‌ రిపోర్ట్‌ వెలువరించిన ‘ఉత్తమ దేశాల ర్యాంకింగ్స్‌ 2024’లో స్విట్జర్లాండ్‌ వరుసగా మూడో ఏడాది అత్యుత్తమ దేశంగా నిలిచింది. భారత్ కు 33వ స్థానం.

ఇన్‌స్టాగ్రామ్‌’ ద్వారా భర్తకు విడాకులు పంపి సంచలనం సృష్టించిన దుబాయ్‌ యువరాణి షేక్‌ మెహ్రా అల్‌ మక్తోమ్‌ తాజాగా మరో ఆసక్తికర ప్రకటన చేశారు. ‘డివోర్స్‌’ పేరుతో సరికొత్త పర్‌ఫ్యూమ్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.

16 ఏండ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వినియోగంపై నిషేధం విధించిన ఆస్ట్రేలియా

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో కీలక అధ్యాయానికి రంగం సిద్ధమైంది. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమాక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ మొదటిసారి ముఖాముఖి చర్చలో పాల్గొననున్నారు

BUSINESS NEWS

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.

సెన్సెక్స్ : 81,921 (362)
నిఫ్టీ : 25,041 (105)

సింగిల్‌ చార్జింగ్‌తో 500 కిలోమీటర్లకుపైగా ప్రయాణించేలా ఓ మధ్య శ్రేణి ఎస్‌యూవీని మారుతి సుజుకి తీసుకురాబోతున్నది.

టాటా మోటర్స్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఈవీ) ధరలు తగ్గాయి. ఆయా మాడళ్లపై ఏకంగా రూ.3 లక్షలదాకా తగ్గించినట్టు మంగళవారం సంస్థ ప్రకటించింది. పాపులర్‌ మాడల్‌ నెక్సాన్‌ ఈవీ రేటు రూ.3 లక్షల వరకు దించినట్టు సంస్థ తెలియజేసింది.

దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర వరుసగా రెండో రోజు పెరిగింది. జ్యువెల్లర్ల నుంచి తాజా డిమాండ్ పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.600 వృద్ధి చెంది రూ.74,100లకు చేరుకున్నది.

ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 14 సిరీస్‌ మాడళ్ల ధరలను రూ.10 వేల వరకు తగ్గించింది. ఈ నూతన ధరలు వెంటనే అమలులోకి రానున్నట్లు పేర్కొంది.

SPORTS NEWS

ప్రతిష్ఠాత్మక 45వ చెస్‌ ఒలింపియాడ్‌కు బుధవారం నుంచి తెరలేవనుంది.

ఇండియన్‌ రేసింగ్‌ ఫెస్టివెల్‌(ఐఆర్‌ఎఫ్‌)లో భాగంగా ఈనెల 14, 15 తేదీల్లో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌(ఐఆర్‌ఎల్‌), ఫార్ములా-4 ఇండియన్‌ చాంపియన్‌షిప్‌(ఎఫ్‌4ఐసీ) మూడో రౌండ్‌ పోటీలు జరుగనున్నాయి.

మంగళూరు(కర్ణాటక) వేదికగా జరుగుతున్న 77వ జాతీయ సీనియర్‌ అక్వాటిక్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ రజత పతకంతో మెరిసింది.

పారా ఒలింపిక్స్ లో భారత్‌ తరఫున బంగారు పతకం సాధించినవారికి రూ. 75 లక్షలు, వెండి వెలుగులు పంచినవారికి రూ. 50 లక్షలు, కాంస్యంతో మెరిసిన క్రీడాకారులకు రూ. 25 లక్షల నజరానా ప్రకటించింది.

భార‌త స్టార్ రెజ్ల‌ర్ బ‌జ్‌రంగ్ పూనియా హైకోర్టును ఆశ్ర‌యించాడు. ఈమ‌ధ్యే రాజ‌కీయాల్లో అడుగు పెట్టిన బ‌జ్‌రంగ్ త‌న‌పై జాతీయ డ్ర‌గ్స్ నిరోధ‌క సంస్థ‌ విధించిన నిషేధాన్ని స‌వాల్ చేస్తూ కోర్టులో పిటిష‌న్ వేశాడు.

ఫుట్‌బాల్‌లో ‘మ్యాచ్ ఫిక్సింగ్‌’ కు పాల్ప‌ చేడిన 43 మంది జీవిత కాల నిషేధానికి గుర‌య్యారు.

భారత యువ షట్లర్లు త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్‌ ద్వయం హాంకాంగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ప్రిక్వార్టర్స్‌కు చేరింది

EDUCATION & JOBS UPDATES

దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని బీటెక్‌, బీ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌-2025 రిజిస్ట్రేషన్‌ నవంబర్‌ నుంచి మొదలుకానుంది.

రాష్ట్రంలోని జూనియ‌ర్ కాలేజీల్లో ప్ర‌వేశాల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు మ‌రోసారి గ‌డువు పొడిగించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సెప్టెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు గ‌డువును పొడిగించారు.

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌’ (ఐఐఎఫ్‌టీ) ప్రపంచస్థాయి బెస్ట్‌ బిజినెస్‌ స్కూల్‌లో చోటు దక్కించుకుంది.

ENTERTAINMENT UPDATES

తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా ప్రతాని రామకృష్ణ గౌడ్‌

ఓటీటీ (Over The Top), ఇతర ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించేందుకు స్వయంప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ సుప్రీంకోర్టు లో పిటిషన్‌ దాఖలైంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు