TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 11 – 08 – 2024

BIKKI NEWS (AUG 11) : TODAY NEWS IN TELUGU on 11th AUGUST 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 11th AUGUST 2024

TELANGANA NEWS

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఆ ధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో 6 మేజర్‌ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిసింది. అందుకోసం రూ.26,000 కోట్ల వ్యయం అవుతుందని రైల్వే అధికారులు అంచనాలు సిద్ధంచేశారు.

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కొత్త చిక్కుముడి.. ఈ నెలలో ముగియనున్న కమిషన్‌ గడువు.

గ్రామాల్లో కుక్కలు.. గురుకులాల్లో ఎలుకలు.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు: హరీశ్‌రావు.

నేడు సీతారామ ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌.. 15న మూడు పంప్‌హౌజ్‌ల ప్రారంభం.

రాష్ట్రంలో పైలేరియా, నులి పురుగుల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

ఉద్యోగుల పాలిట గుదిబండలా మారిన కాంట్రిబ్యూటరీ పెన్ష న్‌ స్కీం(సీపీఎస్‌) రద్దుపై జాతీయస్థాయిలో ఉద్యమానికి ఉద్యోగ సంఘాలు సమాయాత్తమవుతున్నాయి.

రాష్ట్రంలో కొత్త రేష‌న్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టింది. శ‌నివారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది.

తెలంగాణలో టీడీపీని విస్తరిస్తాం: చంద్రబాబు.

సీఎం ఇలాకాలో టీచర్లు లేరు.. కొడంగల్‌ నియోజకవర్గంలో 368 పోస్టులు ఖాళీ.

ANDHRA PRADESH NEWS

ఏపీలోని పలు జలాశయాలు నిండుకుండలా దర్శనం ఇస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం రిజర్వాయర్‌ లకు వరద ఉద్ధృతి కొనసాగుతుంది.

మంగళగిరి కాజి టోల్‌గేట్‌ వద్ద ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు.కార్లను తనిఖీ చేయగా అందులో ఉన్న 230 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తా .. మాజీ మంత్రి బొత్స ధీమా

మండలానికో ఇద్దరిని చంపండి.. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టిన శ్రీశైలం ఎమ్మెల్యే.. వీడియో వైరల్‌.

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ప్రణాళిక సంఘం జాయింట్ సెక్రటరీగా అనంత్‌ శంకర్‌.

NATIONAL NEWS

నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలంతా ఏకమైతే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ 24 గంటల్లో విడుదలవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోడియా చెప్పారు

కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి టీవీ సోమనాథన్‌ను కేంద్ర ప్రభుత్వం శనివారం నియమించింది. 1987 బ్యాచ్‌కు చెందిన తమిళనాడు క్యాడర్‌ అధికారి సోమనాథన్‌ ప్రస్తుతం ఆర్థిక కార్యదర్శిగా ఉన్నారు.

అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు.. ఇద్దరు సైనికులకు గాయాలు.

వయనాడ్‌లో ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే.

హేమంత్ సోరెన్ చేయిపై ఖైదీ ముద్ర‌.. ఫోటో షేర్ చేసిన జార్ఖండ్ సీఎం

విచారణ పూర్తయ్యేదాకా జైల్లోనే మగ్గాలా?.. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐకి సుప్రీం తలంటు.

INTERNATIONAL NEWS

ఆఫ్రికన్‌ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్‌.. 15 వేల మందికి సోకిన వ్యాధి

యూట్యూబ్‌ మాజీ సీఈవో సుసాన్‌ వోజ్కికీ కన్నుమూశారు. 56 ఏండ్ల సుసాన్‌ గత రెండేండ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఇంటర్నెట్‌ను రూపొందించడంలో, గూగుల్‌ చరిత్రలో ఆమె విశేష పాత్ర పోషించారు.

బంగ్లాదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఒబైదుల్‌ హసన్‌ తన పదవికి రాజీనామా సమర్పించారు. న్యాయమూర్తుల భద్రత దృష్ట్యా తాను రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు.

గాజాలో శరణార్థులు తలదాచుకున్న ఓ స్కూల్‌పైనా ఇజ్రాయెల్‌ విచక్షణారహితంగా వైమానిక దాడులకు తెగబడింది. శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో కనీసం 80 మంది చనిపోయి ఉంటారని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్‌తో అంటీముట్టనట్టుగా వ్యవహరించిన మహమ్మద్‌ ముయిజ్జు భారత్‌పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు సన్నిహిత మిత్ర దేశాల్లో భారత్‌ ఒకటని, ముఖ్యమైన భాగస్వామి అని వ్యాఖ్యానించారు.

బంగ్లాదేశ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ అబ్దుర్ రౌఫ్ తాలూక్దార్ రాజీనామా చేశారు. దేశంలో సంక్షోభం నెల‌కొన్న నేప‌థ్యంలో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

BUSINESS NEWS

గౌతమ్‌ అదానీకి చెందిన విదేశీ డొల్ల కంపెనీల్లో సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బచ్‌, ఆమె భర్తకు వాటాలున్నట్టు హిండెన్ బర్గ్ తాజాగా పేర్కొన్నది.

ఆపిల్ నుంచి బుల్లి కంప్యూటర్ మ్యాక్‌మినీ.. త్వరలో ఆవిష్కరణ..

క్రోమ్‌ బ్రౌజర్‌లో అనేక బగ్‌లో ఉన్నాయని.. వాటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెనీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In) పేర్కొంది.

బ్యాంకింగ్‌ చట్టాల్లో సవరణలు చేస్తాం.. ఆర్బీఐ డైరెక్టర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి

రాయితీలు ఇవ్వకపోతే వెళ్లిపోతం.. రేవంత్‌ సర్కార్‌కు అమరరాజా బ్యాటరీ అధినేత అల్టిమేటం

SPORTS NEWS

ప్రస్తుతం జరుగుతున్న పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత ప్లేయర్లు నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో చేజార్చుకున్న పతకాలు ఏడు ఉండడం విశేషం.

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ కేసు తీర్పును అంతర్జాతీయ క్రీడా న్యాయ స్థానం (సీఏఎస్‌) అడ్‌హాక్‌ డివిజన్‌ ఈనెల 13న వెలువరించనుంది.

ఒలింపిక్స్‌ బ‌రిలో ఉన్న ఆఖ‌రి రెజ్ల‌ర్ రితికా హుడా కు చుక్కెదురైంది. మ‌హిళ‌ల 76 కిలోల ఫ్రీ స్ట‌యిల్ విభాగంలో ఆమె పోరాటం క్వార్ట‌ర్ ఫైన‌ల్లోనే ముగిసింది.

EDUCATION & JOBS UPDATES

తెలంగాణ రాష్ట్రం లో కొత్త టీచర్లు వచ్చే వరకు విద్యా వాలంటీర్స్ నియమాకానికి ప్రభుత్వం అనుమతి.

ఏపీ ట్రిపుల్ ఐటీ లలో మూడో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కు ఆగస్టు 12 వరకు గడువు.

CSIR UGC NET 2024 ప్రాథమిక కీ విడుదల

ప్రత్యేక విడత దోస్త్ రిపోర్టింగ్ గడువు ఆగస్టు 13 వరకు.

ఏపీ లో ఎంబీబీఎస్ , బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు నోటిఫికేషన్ జారీ.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు