TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 10 – 09 – 2024

BIKKI NEWS (SEP. 10) : TODAY NEWS IN TELUGU on 10th SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 10th SEPTEMBER 2024

TELANGANA NEWS

11న తెలంగాణకు కేంద్ర బృందం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన.

హైదరాబాద్‌ శివారులోని గ్రీన్‌ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ(పీఏసీ) చైర్మ‌న్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియ‌మించ‌డాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు త‌ప్పుబ‌ట్టారు. పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి విప‌క్షాల‌కు ఇవ్వ‌డం ఆన‌వాయితీ అని గుర్తు చేశారు

ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ, ఎస్టిమేట్స్ క‌మిటీతో పాటు ప్ర‌జా ప‌ద్దుల సంఘానికి చైర్మ‌న్ల‌ను నియ‌మించింది ప్ర‌భుత్వం. ఈ మేర‌కు శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి వీ న‌ర‌సింహాచార్యులు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు ‘హైడ్రా’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు

రాష్ట్రంలో వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాలతో పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

తెలంగాణలో రాగల మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రెటరీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అనర్హత పిటిషన్లను స్పీకర్‌ ముందుంచాలని స్పష్టం చేసింది.

ANDHRA PRADESH NEWS

మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న ఆయన ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యారు.

తమ వైఫల్యాలను బయటపడేందుకే జగన్‌పై విమర్శలు చేస్తున్నారు.. చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాణి

విజయవాడలో వరద బీభత్సానికి ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. వరదల కారణంగా 45 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీటన్నింటినీ రాజకీయ హత్యలుగానే పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఒడిశాలోని పూరీకి 70 కిలోమీటర్లు, గోపాలపూర్‌కు 140కి.మీ., కళింగపట్నం(శ్రీకాకుళం)కు 240కి.మీ., దిఘా ( పశ్చిమ బెంగాల్‌)కు 290కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

తిరుమలకు మళ్లీ భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఏజెన్సీలో ఉన్న జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గిరిజనుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియల కింద చిక్కుకుపోయిన నలుగురిని గ్రామస్తులు కాపాడారు.

NATIONAL NEWS

క్యాన్సర్ మందులపై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తగ్గించామని.. దాంతో ఖర్చును మరింత తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఎంపిక చేసిన స్నాక్స్‌పై పన్నును 18శాతం నుంచి 12శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించిందని చెప్పారు.

కేదార్‌నాథ్‌, బద్రీనాథ్ తదితర తీర్థయాత్రలకు భక్తులను తీసుకెళ్లే హెలికాప్టర్‌ సేవలపై పన్ను 18శాతం నుంచి 5శాతానికి తగ్గించారు.

మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జాతుల మధ్య పోరాటానికి డ్రోన్లు, క్షిపణులను వినియోగిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. ఈ నేపథ్యంలో డ్రోన్, క్షిపణి దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు.

కర్నాటక సీఎం మార్పు వ్యవహారంపై సాగుతున్న ఊహాగానాలను రాష్ట్ర మంత్రి ప్రియాంక్‌ ఖర్గే తోసిపుచ్చారు.

డాక్ట‌ర్ల స‌మ్మె వ‌ల్ల 23 మంది రోగులు మృతి… సుప్రీంకు చెప్పిన బెంగాల్ స‌ర్కారు

మంగళవారం సాయంత్రం 5గంటల్లోగా విధులకు హాజరుకావాలి.. కోల్‌కతా వైద్యులకు సుప్రీంకోర్టు ఆదేశం..

ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం.. కాలుష్యంతో కేజ్రీవాల్‌ సర్కారు కీలక నిర్ణయం..

కాంగ్రెస్‌తో తేలని పొత్తు.. హర్యానా ఎన్నికలకు తొలి జాబితా విడుదల చేసిన ఆప్‌.

భారత్‌లో ‘మంకీపాక్స్‌’ వైరస్‌ వ్యాప్తి కలవరపెడుతోంది. ఆఫ్రికన్‌ దేశం నుంచి వచ్చిన ఒక యువకుడిలో వ్యాధి లక్షణాలు కన్పించడంతో వెంటనే అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయం వంటివి లేవని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు.

INTERNATIONAL NEWS

టైఫూన్ యాగి తీవ్ర న‌ష్టాన్ని మిగిల్చింది. ఉత్త‌ర వియ‌త్నాంలో ఉన్న ఓ బిజీ బ్రిడ్జ్ .. ఆ తుఫాన్ ధాటికి కూలిపోయింది. దీంతో బ్రిడ్జ్ మీద ఉన్న ప‌ది కార్లు, రెండు స్కూట‌ర్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి.

భారత్‌తో సత్సంబంధాలనే కోరుకుంటున్నాం : బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం.

సుడాన్‌ మార్కెట్‌పై బాంబు దాడి.. 21 మంది మృతి

BUSINESS NEWS

స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి

  • సెన్సెక్స్ – 81,560 (346)
  • నిఫ్టీ – 24,936 (84)

ఇన్ఫీలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు.. 16 సంస్థలపై ఆంక్షలు ఎత్తేసిన సెబీ..

నేను పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు వ్యతిరేకం కాదు.. : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

స్పేస్ ఎక్స్‌, టెస్లా కంపెనీ సీఈవో ఎల‌న్ మ‌స్క్‌ ప్ర‌పంచంలోనే తొలి ట్రిలియ‌నీర్‌గా నిల‌వ‌నున్నారు. 2027 నాటికి ఆయ‌న ట్రిలియ‌న్ డాల‌ర్లు క‌లిగిన వ్య‌క్తిగా రికార్డుల్లోకి ఎక్క‌నున్న‌ట్లు ఇన్‌ఫార్మా క‌నెక్ట్ అకాడ‌మీ తెలిపింది.

SPORTS NEWS

ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీలో భారత హకీ జట్టు 5-1 తేడాతో జపాన్ పై ఘన విజయం సాధించింది.

యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జాన్నిక్ సిన్న‌ర్ గెలిచాడు. ఫైన‌ల్లో అత‌ను టేల‌ర్ ఫ్రిట్జ్‌పై 6-3, 6-4,7-5 స్కోరు తేడాతో విజ‌యం సాధించాడు.

మూడో టెస్టులో శ్రీ‌లంక అద్భుత విజ‌యం సాధించింది. వ‌రుస‌గా రెండు టెస్టుల్లో ఓట‌మిని దిగ‌మింగి భారీ విజ‌యంతో ఇంగ్లండ్‌ ను ఓడించింది.

EDUCATION & JOBS UPDATES

రాష్ట్రంలో వర్షాలు, వరదల నేపథ్యంలో దోస్త్‌ స్పెషల్‌ డ్రైవ్‌ అడ్మిషన్స్‌ షెడ్యూల్‌లో మార్పులు చేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు