BIKKI NEWS (DEC 10) : TODAY NEWS IN TELUGU on 10th DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 10th DECEMBER 2024
TELANGANA NEWS
తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణ. చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. – సీఎం
అదాని – రేవంత్ బొమ్మలు ఉన్న టీషర్ట్ తో అసెంబ్లీ కి కేటీఆర్ – అరెస్ట్
ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న పరీక్షల హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో సోమవారం అందుబాటులో ఉంచింది
మంచు కుటుంబంలో విభేదాలు తారస్థాయి చేరుకున్నా యి. తన కొడుకు, కోడలు నుంచి ప్రాణహాని ఉందంటూ మోహన్‌బాబు రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
స్పెషల్ పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరం తెలుపుతూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సర్కారుకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
‘తెలంగాణ తల్లి’ రూపాన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏటా డిసెంబర్ 9న అధికారికంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నది.
ఆశా వర్కర్లపై పోలీసుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీశ్‌రావు
ANDHRA PRADESH NEWS
నంద్యాల జిల్లాలో ప్రేమించలేదనే కారణంతో ఇంట్లో నిద్రిస్తున్న ఇంటర్ విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడికక్కడే మృతి.
త్వరలోనే మంత్రివర్గంలోకి నాగబాబు
సేకీ ఒప్పందం పై అసత్య వార్తలు రాశారంటూ జగన్ మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేశారు.
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాద్యాయ ఎమ్మెల్సీగా గోపీమూర్తి గెలుపు
NATIONAL NEWS
వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సమాయత్తమవుతున్నది.
వివక్షా వైఖరిని ప్రదర్శిస్తున్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు యోచిస్తున్నాయి.
మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సెప్టెంబరులో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసింది.
బెంగాల్, బీహార్, ఒడిశా రాష్ర్టాలు ఒకప్పుడు తమవేనన్న వాదనను బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీ తెరపైకి తీసుకొచ్చింది.
మహిళలకు ఆర్థిక సాధికారిత కల్పించేందుకు ఎల్‌ఐసీ బీమా సఖి యోజనను ప్రధాని మోదీ ప్రారంభించారు.
ఎంతకాలం ఈ ఉచితాలు అందచేయాలి అంటూ సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
సగటున 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుల్లో నిలిచిందని యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ సోమవారం తెలిపింది.
బుర్కినా ఫాసోకు భారత రాయబారిగా ఓం ప్రకాష్ మీనా
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్యకు అవకాశం
INTERNATIONAL NEWS
సిరియాలో తిరుగుబాటుదళాల ఆక్రమణతో దేశాన్ని వీడిన మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అస్సద్‌కు రష్యా రాజకీయ ఆశ్రయం కల్పించింది.
హైతీ దేశంలో చేతబడి నెపంతో 110 మంది వృద్ధుల ఊచకోత.
రేడార్ వొరోనేజ్‌ను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్నది. సుమారు 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణిని ఆ రేడార్ పసికట్టేయగలదు
ఐఎన్ఎస్ తుషిల్ యుద్ధనౌకను ఇండియాకు రష్యా అప్పగించింది. కాలినిన్‌గ్రాడ్ షిప్‌యార్డులో జరిగిన అప్పగింత జరిగింది.
BUSINESS NEWS
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 81,508.46 (-200.66)
నిఫ్టీ : 24,619.00 (-58.80)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను సోమవారం కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇతను 26వ గవర్నర్.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి 6 నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు రైటాఫ్ చేసిన రుణాల విలువ రూ.42,035 కోట్లుగా ఉన్నది.
ఫారెక్స్ మార్కెట్‌లో సోమవారం ఒకేరోజు రూపాయి విలువ 20 పైసలు నష్టపోయి నెల కనిష్ఠ స్థాయిని 84.86ని తాకింది
33 మొబైల్స్ లలో త్వరలో వాట్సప్ సర్వీసులు బంద్..
SPORTS NEWS
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో 11 రౌండ్లు ముగిశాక లిరెన్, గుకేశ్ చెరో 6 పాయింట్లతో ఉన్నారు.
ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను టీమ్‌ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ జరిమానా విధించారు.
EDUCATION & JOBS UPDATES
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సెప్టెంబరులో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసింది.
ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న పరీక్షల హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో సోమవారం అందుబాటులో ఉంచింది
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్