BIKKI NEWS (AUG 10) : TODAY NEWS IN TELUGU on 10th AUGUST 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 10th AUGUST 2024
TELANGANA NEWS
ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ – నినాదాన్ని ఖరారు చేసిన సీఎం. అమెరికా లో పలు కంపెనీలతో ఒప్పందం చేసుకున్న సీఎం.
ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు. వరంగల్ ఎంజీఎం లో శిశువు మృతదేహంను పీక్కుతిన్న శునకం.
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 84.59 లక్షల ఎకరాలకే పరిమితమైన సాగు విస్తీర్ణం. గతేడాది ఇదే సమయంలో కోటి ఎకరాలు దాటిన సంగతి తెలిసిందే.
గొట్టిముక్కల ఎగువ బాగాన రెండు జలాశయాలు నిర్మించాలని నేషనల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అథారిటీ (NWDA) సమావేశంలో తెలంగాణ విజ్ఞప్తి చేసింది.
ప్రధాని మోదీ తో మందకృష్ణ మాదిగ గౌరవపూర్వక భేటీ. ఎస్సీ వర్గీకరణకు సహకరించినందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
సుంకిశాల కుంగుబాటు నష్టాన్ని కాంట్రాక్టర్ భరిస్తాడు. – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
పంట పండించే రైతులకే భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని,. కౌలు రైతులను గుర్తించే అంశంపైనా అభిప్రాయాలు సేకరించాకే నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.
గ్రూప్-2లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని, గ్రూప్-1 మొయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అనుమతించేవిధంగా ప్రభుత్వంపై నిరుద్యోగుల పక్షాన ఒత్తిడి పెంచాలని కోరుతూ కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు.
జనగామలో న్యాయవాద దంపతులపై దాడి చేసిన సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై తిరుపతి, తదితర పోలీసు సిబ్బందిని బదిలీ చేసి చేతులు దులుపుకోకుండా బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ANDHRA PRADESH NEWS
రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు చంద్రబాబు, లోకేష్ లే ప్రధాన ముద్దాయిలు. గ్రామస్థాయి నుండి రెడ్ బుక్ ను అమలు చేస్తున్న టిడిపి. – వైయస్ జగన్
జగన్ రెడ్డి పేరు తీసేసి.. అంబేడ్కర్ విలువ పెంచారు.. అంబేద్కర్ స్మతివనం దాడి ఘటనపై టీడీపీ సంచలన వ్యాఖ్యలు.
అర్హత ఉన్న వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని పేర్కొన్నారు. టార్గెట్ అంటూ ఏమీ లేదని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు.
NATIONAL NEWS
నీట్ పీజీ 2024 పరీక్షను వాయిదా వేయలేం – సుప్రీం కోర్ట్
లిక్కర్ కేసులో ఖైదీగా ఉన్న మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
జమ్ము కాశ్మీర్ అసెంబ్లీకి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం కృతనిశ్చయంతో ఉందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజు కుమార్ ప్రకటించారు.
తాము ధరించే దుస్తులను ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థినులకు ఉండాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా హీజాబ్ సర్కులర్ పై సుప్రీం స్టే విధించింది.
గ్రామాల్లో మరో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద ఈ ఇళ్ళు నిర్మించనున్నారు.
ఏస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో క్రిమిలేయర్ అనుసరించాలని కేంద్రం రాజ్యాంగంలో లేదని కేంద్రం వ్యాఖ్యానించింది
8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు కేంద్రం పచ్చ జెండా ఊపింది.
రాజకీయ, అధికార యంత్రాంగాల్లో భారీగా ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయనిపిస్తున్నది’ అంటూ అంతర్జాతీయ యాంటీ-మనీ లాండరింగ్ వాచ్‌డాగ్.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) భారత్‌ను గట్టిగా హెచ్చరించిందని సమాచారం.
ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈనెల 20వ తేదీ నుంచి ఓటరు జాబితా సవరణ ప్రారంభమై జనవరి 6న తుది జాబితా ప్రకటనతో ముగియనుంది
INTERNATIONAL NEWS
బ్రెజిల్ లోని సావో పాలో రాష్ట్రంలో విమానం కుప్ప కూలిన ఘటలో అందులో ప్రయాణిస్తున్న మొత్తం 62 మంది ప్రయాణికులు చనిపోయారు.
ట్రావెల్ ఏజెంట్లతో జాగ్రత్త.. ప్రవాసులకు భారత రాయబార కార్యాలయం హెచ్చరిక.
రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ సైన్యం 30 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లింది.
బాలికల కనీస వివాహ వయసును 18 నుంచి 9 ఏండ్లకు తగ్గిస్తూ ఇరాక్ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం బాలుర వివాహ వయసును 15కు తగ్గించారు.
అంతరించిపోతున్న దశలో ఉన్న 10 లక్షల జీవ జాతులు.. చంద్రుడిపై లైఫ్ బ్యాంక్.
యుద్ధ క్షేత్రంలోకి రోబో శునకాలు.. సరికొత్త ఆయుధాన్ని ఆవిష్కరించిన ఉక్రెయిన్.
BUSINESS NEWS
కోలుకుంటున్న స్టాక్ మార్కెట్ లు. సెన్సెక్స్ 820, నిఫ్టీ 250 పాయింట్ల లాభం
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బెస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.
అత్యవసర సహాయ సామగ్రిని అందించడానికి.. హైదరాబాద్‌లో అమెజాన్ హబ్స్.
15న ఓలా ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరణ.. ఆరు నెలల్లో సేల్స్ ప్రారంభం..
ఈ నెల రెండో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ (Forex Reserve) నిల్వలు 675 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.1,100 ఎగబాకి రూ.72,450 పలికింది. పెరగముందు ధర రూ.71,350గా ఉన్నది. పసిడితోపాటు వెండి భారీగా పెరిగింది. కిలో వెండి ఏకంగా రూ.1,400 అధికమై రూ.82,500కి చేరింది.
SPORTS NEWS
పారిస్ ఒలంపిక్స్ 2024లో భారత్ రెజ్లర్ అమన్ షెహ్రవత్ కాంస్య పతకం సాధించాడు. దీంతో ఈ ఒలింపిక్స్ లో భారత్ కు ఆరు పథకాలు దక్కాయి.
బల్గేరియా వెయిట్ లిఫ్టర్ కార్లొస్ నాసర్ రికార్డు బరువు ఎత్తి పారిస్‌లో కొత్త చరిత్ర లిఖించాడు. 21 ఏండ్ల ఈ కుర్రాడు పురుషుల 89 కిలోల విభాగంలో ఏకంగా 404 కిలోల బరువును ఎత్తి ఒలింపిక్ రికార్డులతో పాటు ప్రపంచ రికార్డుల ను బ్రేక్ చేశాడు.
లైంగికదాడి ఆరోపణలు.. ఈజిప్టు రెజ్లర్ మహమ్మద్ ఎల్‌సయ్యద్ అరెస్ట్.
ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత మువ్వన్నెల పతకాన్ని చేతబూనే అవకాశం యువ షూటర్ మను భాకర్‌తో పాటు హాకీ దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్‌కు దక్కింది
వినేశ్ ఫోగట్ సిల్వర్ మెడల్‌కు అర్హురాలే.. నిబంధనలను సమీక్షించాలన్న భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.
EDUCATION & JOBS UPDATES
CPGET 2024 RESULTS విడుదల.
CPGET 2024 COUNSELING షెడ్యూల్ విడుదల
‘మనూ’ యూనివర్సిటీ లో డిగ్రీ ప్రవేశాలు కొరకు ఆగస్టు 12 నుంచి దరఖాస్తులు.
తెలంగాణ రాష్ట్రంలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు ఇక నుంచి కేవలం యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగానే కల్పిసారు.
ENTERTAINMENT UPDATES
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్ ఇండియా యాక్షన్ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.
నాగచైతన్య, శోభిత 2027లో విడిపోతారు : వేణుస్వామి
ఇండియన్ 2 పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. నేటి నుంచి (ఆగస్టు 9) తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.
సుప్రీంకోర్టులో ‘లాపతా లేడీస్’ ప్రదర్శన.. ఆమిర్ ఖాన్‌తో కలిసి వీక్షించనున్న సీజేఐ, న్యాయమూర్తులు