చరిత్రలో ఈరోజు జూన్ 24

★ సంఘటనలు :

1950: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు బ్రెజిల్ లో ప్రారంభమయ్యాయి.
1963: భారత తంతి తపాలాశాఖ టెలెక్స్ సేవలను ప్రారంభించింది.

★ జననాలు :

1896: జి.వి. కృపానిధి, పలు ఆంగ్లపత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన తెలుగువాడు. (మ.1970)
1902: గూడవల్లి రామబ్రహ్మం, సినిమా దర్శకులు, సంపాదకులు. (మ.1946)
1902: జమిలి నమ్మాళ్వారు, ప్రచురణకర్త, పత్రికా సంపాదకుడు
1915: పాలగుమ్మి పద్మరాజు, తెలుగు సినీ రచయిత. (మ.1983)
1924: చతుర్వేదుల నరసింహశాస్త్రి, సాహిత్యవేత్త. (మ.1991)
1928: ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. (మ.2015)
1940: మాగంటి మురళీమోహన్, తెలుగు సినిమా కథానాయకుడు, నిర్మాత.
1964: విజయశాంతి, తెలుగు సినిమా నటి.
1967: ఎం.చంద్రశేఖర్, 2009 ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి మల్లు రవిపై విజయం సాధించి మూడవసారి శాసనసభలో ప్రవేశించాడు.

★ మరణాలు :

1890: తల్లాప్రగడ సుబ్బారావు, అసాధారణ మేధావి. (జ.1856)
1908: గ్రోవర్ క్లీవ్‌లాండ్, అమెరికా మాజీ అధ్యక్షుడు (జ.1837).
1964: కొత్త రాజబాపయ్య, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యాబోర్డులో, రాష్ట్రవిద్యాసలహాసంఘం సభ్యుడు (జ.1913).
2008: మల్లికార్జునరావు, తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు (జ.1960).
2015: పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృత పండితుడు (జ.1927).
2016: నీల్ ఓబ్రీన్, భారతదేశంలో మొట్టమొదటి క్విజ్ మాస్టర్ (జ.1934).