చరిత్రలో ఈరోజు అక్టోబర్ 23

◆ సంఘటనలు

1990: అయోధ్యకు రథయాత్ర చేస్తున్న భారతీయ జనతా పార్టీ అప్పటి అధ్యక్షుడు ఎల్.కె.అద్వానీని బీహార్ లోని సమస్తిపూర్ లో అరెస్టు చెయ్యడంతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంది.

◆ జననాలు

1873: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (మ.1975)
1922: అనిశెట్టి సుబ్బారావు, రచయిత.
1923: భైరాన్‌సింగ్ షెకావత్ (Bhairon Singh Shekhawat) భారతదేశపు మాజీ ఉప రాష్ట్రపతి [మ. 2010].
1924: ఆర్.కె.లక్ష్మణ్, వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (మ.2015)
1924: కె. ఎల్. నరసింహారావు, నాటక రచయిత, నటుడు, నాటక సమాజ స్థాపకుడు. (మ.2003)
1939: భగవాన్ (చిత్రకారుడు), మంచి వ్యంగ్య చిత్రకారుడు. ఈయన కార్టూన్‌లు 1960 దశకం చివరి రోజులనుండి దాదాపు 1980ల వరకు అనేక వార, మాస పత్రికలలో వచ్చినవి [ మ.2002].
1940: పీలే, బ్రెజిల్‌ ఫుట్‌బాల్ ఆటగాడు.
1979: ప్రభాస్, తెలుగు సినిమా నటుడు.
1985: ప్రదీప్ మాచిరాజు, టివి వ్యాఖ్యాత (యాంకర్)
1989: జోనితా గాంధీ, నేపథ్య గాయని.

◆ మరణాలు

1623: తులసీదాసు, హిందీ రామాయణకర్త (జ.1532).
2007: ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత (జ.1927).
1980: న్యాయపతి కామేశ్వరి, రేడియో అక్కయ్యగా పేరుపొందినది, న్యాయపతి రాఘవరావుతో వివాహం జరిగింది (జ.1908).