చరిత్రలో ఈరోజు నవంబర్ – 09

★ దినోత్సవం

  • లీగల్ సర్వీసెస్ దినం.
  • ప్రపంచ నాణ్యతా దినోత్సవం.
  • ఉత్తరాఖండ్ ఫౌండేషన్ డే

★ సంఘటనలు

1985: భారతదేశపు న్యాయసేవాదినం. పేద, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయసహాయం అందించే చట్టం అమలులోకి వచ్చింది.
1989: 1961 ఆగస్టు 13 తేదీన బెర్లిన్, ఈస్ట్ జర్మనీగా విభజించబడింది. బ్రన్దేన్బుర్గ్ గేట్ మూసివేయబడింది శరణార్థుల వలసలను అడ్డుకోవడానికి, నగరం యొక్క తూర్పు, పశ్చిమ రంగాల మధ్య సరిహద్దును మూసివేసారు. రెండు రోజుల తరువాత, బెర్లిన్ వాల్ గోడ కట్టడం ప్రారంభమైంది. తూర్పు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 1989 నవంబరు 9 వరకు ఈ బెర్లిన్ వాల్ ఒక అడ్డంకిగా నిలిచింది.

★ జననాలు

1877: ముహమ్మద్ ఇక్బాల్. ఉర్దూ, పారశీ భాషలలో కవి.
1895: దువ్వూరి రామిరెడ్డి, ఆధునికాంధ్ర కవుల్లో దవ్వూరి ముందు వరుసలో వుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. (మ.1947)
1917: పిడతల రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు, మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (మ.1991)
1924: కాళీపట్నం రామారావు, సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు, ఉపాధ్యాయులు.
1936: రేకందార్ అనసూయాదేవి, సురభి నటి.
1946: ముకుంద రామారావు, ప్రస్థానం మొదట కథారచయితగా ప్రారంభమైనా కవిగా స్థిరపడ్డాడు. అనువాదకుడిగా రాణించాడు
1948: గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, పేరొందిన సంగీత విద్వాంసులు, కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరొందాడు.
1954: శంకర్ నాగ్, కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు జననం.
1970: క్రిస్ జెరిఖో, కుస్తీయోధుడు, టెలివిజన్, రంగస్థల నటుడు, రచయిత, రేడియో వ్యాఖ్యాత, టెలివిజన్ వ్యాఖ్యాత, రాక్ గాయకుడు.
1978:: రాజా: తెలుగు సినీ నటుడు

★ మరణాలు

2009: హరగోవింద్ ఖురానా, నోబెల్‌ బహుమతి గ్రహీత. (జ.1922).
1927: మాగంటి అన్నపూర్ణాదేవి: రచయిత్రి, సమాజ సేవిక, స్వాతంత్ర్య సమర యోధురాలు. (జ 1900)
2005: కె.ఆర్.నారాయణన్, భారత దేశ పూర్వ రాష్ట్రపతి. (జ.1920)