చరిత్రలో ఈరోజు నవంబర్ – 07

★ దినోత్సవం

  • ఎన్.టి.పీ.సి. స్థాపన దినోత్సవం.
  • బాలల సంరక్షణ దినం.
  • ప్రపంచ వేసక్టమీ దినోత్సవం .
  • జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం

★ సంఘటనలు

1917: రష్యా విప్లవం (బోల్షెవిక్ విప్లవం లేదా అక్టోబర్ విప్లవం) విజయవంతమైంది. అప్పట్లో రష్యా ఉపయోగించుతున్న జూలియన్ కాలెండర్ ప్రకారం ఆ నెల అక్టోబర్. అందువలన దీనిని అక్టోబర్ విప్లవం అని అన్నారు.
1950: నేపాల్ రాజుగా జ్ఞానేంద్ర పదవిలోకి వచ్చాడు.

★ జననాలు

1728: జేమ్స్ కుక్, ఆంగ్ల- నావికుడు, సముద్ర యానికుడు, సాహస యాత్రికుడు. (మ.1779)
1858: బిపిన్ చంద్ర పాల్, భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు. (మ.1932)
1867: మేరీక్యూరీ, భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత. (మ.1934)
1888: చంద్రశేఖర్ వెంకటరామన్, భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత. (మ.1970)
1900: పాటూరి రాజగోపాల నాయుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. రైతు నాయకుడు. సాహితీవేత్త.
1900: ఎన్.జి.రంగా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. (మ.1995)
1912: చితిర తిరునాల్ బలరామ వర్మ, ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు. (మ.1991)
1920: బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. (మ.2005)
1928: ఎం.ఎల్.నరసింహారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త. (మ.2016)
1932: గిడుగు రాజేశ్వరరావు, తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (మ.2013)
1937: కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని. (మ.2016)
1954: కమల్ హాసన్, చలనచిత్ర నటుడు.
1957: వై.విజయ, తెలుగు సినిమా నటి, నృత్య కళాకారిణి.
1960: రూప: తెలుగు చలనచిత్ర నటి.
1960: సప్పా దుర్గాప్రసాద్, నృత్యకళాకారుడు.
1970: డిస్కో శాంతి, తెలుగు శృంగార నృత్యతార.
1971: రీతూపర్ణ సేన్ గుప్త, బెంగాలి సినిమాలో నటి.
1971: త్రివిక్రమ్ శ్రీనివాస్ , తెలుగు సినీ మాటల రచయిత, కథా రచయిత, దర్శకుడు.
1973: వేణు దోనేపూడి, భారతీయ ఆటోమొబైల్ పారిశ్రామికవేత్త, మల్టీబ్రాండ్ కార్ సేవల కంపెనీ కార్జ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌.
1979: రైమా సేన్ , చలన చిత్ర నటి .
1980: కార్తీక్, తెలుగు, తమిళ చిత్రసీమలో గాయకుడు.
1981: అనుష్క శెట్టి, భారతీయ సినీ నటి.

★ మరణాలు

1975: జియాఉర్ రెహ్మాన్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు.
1992: మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో కవి. (జ.1920)
2000: సి.సుబ్రమణ్యం, భారతీయుడు, భారతరత్న గ్రహీత. (జ.1910)
2014: ద్వివేదుల విశాలాక్షి, కథా, నవలా రచయిత్రి. (జ.1929)