BIKKI NEWS : Today in history november 2nd
Today in history november 2nd
దినోత్సవం
- ఇండియన్ అరైవల్ డే. (మారిషస్)
- ఆల్ సోల్స్ డే
సంఘటనలు
1774: రాబర్టు క్లైవు ఇంగ్లండులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున భారత్‌లో పనిచేసిన క్లైవు, కంపెనీ భారత్‌లో సాగించిన ఆక్రమణలలో ముఖ్య భూమిక నిర్వహించాడు. 1757లో జరిగిన, ప్రసిద్ధి చెందిన ప్లాసీ యుద్ధంలో బ్రిటీషు సేనాధిపతి ఈయనే. అప్పుల బాధ తట్టుకోలేక అత్మహత్యకు పాల్పడ్డాడు.
1976: భారత రాజ్యాంగం యొక్క 42 వ సవరణను లోక్‌సభ ఆమోదించింది. అప్పటివరకు సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత్, ఈ సవరణ తరువాత సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమయింది.
జననాలు
1865: పానుగంటి లక్ష్మీ నరసింహారావు, తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించినవాడు (మ.1940).
1920: పట్రాయని సంగీతరావు, ఆంధ్ర దేశానికి చెందిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు.
1925: అబ్బూరి కమలాదేవి , రంగస్థల నటి, హరిశ్చంద్ర,శ్రీకృష్ణ , దుర్యోధన, పాత్రలకు పెట్టింది పేరు, సినిమాలలో నటించింది.
1956: రాజ్యం. కె, రంగస్థల నటి (మ.2018).
1965: షారుఖ్ ఖాన్, బాలీవుడ్ నటుడు.
1995: నివేదా థామస్,మోడల్, మలయాళ, తమిళ,తెలుగు నటి
మరణాలు
1958: సామి వెంకటాచలం శెట్టి, వ్యాపారవేత్త, కాంగ్రేసు పార్టీ రాజకీయ నాయకుడు, మద్రాసు కార్పోరేషన్ యొక్క ప్రథమ కాంగ్రేసు అధ్యక్షుడు (జ.1887).
1962: త్రిపురనేని గోపీచంద్, సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1910)
2010: ఎ .హెచ్.వి. సుబ్బారావు, పాత్రికేయుడు. (జ.1934)
2012: కింజరాపు ఎర్రన్నాయుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (జ.1957)
2015: కొండవలస లక్ష్మణరావు, తెలుగు నాటక, చలన చిత్ర నటుడు. (జ.1946)
2022: చల్లా భగీరథరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనమండలి సభ్యుడు. (జ.1976)