★ దినోత్సవం
- అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
- ప్రపంచ టాయిలెట్ దినోత్సవం
- ప్రపంచ సాంస్కృతిక వారసత్వ దినం.
- పౌరుల దినోత్సవం .
★ సంఘటనలు
1951: మొదటి ఆర్దిక సంఘము (ఫైనాన్స్ కమిషన్) ఏర్పడిన రోజు. భారత రాజ్యాంగంలోని 280 అధికరణం ఇచ్చిన అధికారంతో, భారత దేశ అధ్యక్షుడు, ఈ ఆర్ధిక సంఘము ఏర్పాటు చేయవచ్చును.
1977: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలను, ముఖ్యంగా కృష్ణా జిల్లా దివిసీమను అతలా కుతలం చేసిన పెను తుఫాను వచ్చిన రోజు.
★ జననాలు
1828: ఝాన్సీ లక్ష్మీబాయి, భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు. (మ.1858) – మరాఠా సామ్రాజ్య ప్రాంతంలో అమరవీరుల దినోత్సవముగా జరుపుకుంటారు.[1]
1852: అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్, భారత్‌లోని బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల స్థాపకుడు. (మ.1909)
1917: ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1984)
1923: మట్టపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త, దాత. (మ.2017)
1928: దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (మ.2012)
1954: చింతా మోహన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు.
1936: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (మ.2017)
1960: శుభలేఖ సుధాకర్, నటుడు.
1965: కిల్లి కృపారాణి, రాజకీయ నాయకురాలు, వైద్యురాలు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి 15 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం.
1973: షకీలా, భారతీయ నటి.
1975: సుష్మితా సేన్, విశ్వ సుందరి పోటీలో విజేతగా ఎన్నుకొనబడి భారతీయ నటి.
★ మరణాలు
1806: రెండవ షా ఆలం, మొఘల్ చక్రవర్తి. (జ.1728)
1995: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1908)
1995: మద్దిపట్ల సూరి, రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. (జ.1920)
2007: పులికంటి కృష్ణారెడ్డి, కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (జ.1931)
2022: మదన్, తెలుగు సినీ దర్శకుడు