చరిత్రలో ఈరోజు నవంబర్ 13

★ దినోత్సవం

ప్రపంచ దయ దినోత్సవం

★ సంఘటనలు

1930: మొదటి రౌండు టేబులు సమావేశాన్ని ఐదవ జార్జి చక్రవర్తి లండనులో లాంఛనంగా ప్రారంభించాడు.

★ జననాలు

1899: హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (మ.1982)
1904: పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు. (మ.1982)
1914: హెన్రీ లాంగ్లోయిస్, అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (మ.1977)
1917: వసంత్‌దాదా పాటిల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
1920: కె.జి.రామనాథన్, భారతీయ గణిత శాస్త్రవేత్త. (మ.1992)
1925: టంగుటూరి సూర్యకుమారి, గాయని, నటీమణి. (మ.2005)
1926: ఎ.ఆర్.కృష్ణ, నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1992)
1935: పి.సుశీల, భారతీయ సినీ గాయని.
1957: ఇ.జి.సుగవనం, తమిళనాడులోని డి.ఎం.కె.పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు.
1967: జుహీ చావ్లా, భారత సినీనటి.
1969: రాజీవ్ కనకాల , తెలుగు చలనచిత్ర నటుడు, దర్శకుడు.
1991: అభినయ, మోడల్ , తెలుగు, కన్నడ, చిత్రాల నటి

★ మరణాలు

1973: బారు అలివేలమ్మ, స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు.
1974: విట్టొరియో డి సికా, ఇటాలియన్ దర్శకుడు, నటుడు. (జ.1901)
1976: పండితారాధ్యుల నాగేశ్వరరావు, పత్రికారచయిత, ఎడిటర్‌, సంపాదకుడు.
1993: గురజాడ కృష్ణ దాసు వెంకటేష్ ,సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు (జ.1927)
2002: కాళోజీ నారాయణరావు, తెలుగు కవి, తెలంగాణావాది. (జ.1914)
2010: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు. (జ.1928)