Q1. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ఆయుర్వేద కేంద్రాన్ని భారత్ లో ఎక్కడ శంకుస్థాపన చేశారు.?
జ :- గుజరాత్ లోని జామ్ నగర్ లో
Q2. ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న దేశం భారత్ అని పేర్కొన్న సంస్థ ఏది.? జ :- అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF)
Q3. భారత వృద్ధి రేటు 2022లో ఎంత శాతం ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది.?
జ :- 8.2 శాతం
Q4. సెమికాన్ ఇండియా 2022 సదస్సు ఎప్రిల్ 29న ఏ నగరంలో జరగనుంది.?
జ :- బెంగుళూరు
Q5. తాజాగా అమెరికాలో భారత ఆర్థిక శాఖ మంత్రి తో IMF చీఫ్ సమావేశమయ్యారు.? ప్రస్తుత IMF చీఫ్ గా ఎవరు ఉన్నారు.?
జ :- క్రిస్టినా జార్జివా
Q5. తెలంగాణకు సంబంధించి ‘ఒన్ ఎమాంగ్ అండ్ ఎమాంగస్ట్ ది పీపుల్’, పుదుచ్చేరి పాలనపై ‘ఏ ఇయర్ ఆఫ్ పాజిటివిటీ’అనే పుస్తకాలు రచించినది ఎవరు.?
జ :- సౌందర్ రాజన్ తమిళసై
Q6. భారతదేశ 29వ సైనిక దళాధిపతి గా ఎవరు నియమితులయ్యారు.?
జ :- జనరల్ మనోజ్ పాండే
Q7. చైనా గోడ తర్వాత అత్యంత పొడవైన గోడ భారత్ లో ఎక్కడ ఉంది.?
జ :- కుంబల్ ఘడ్ కోట (రాజస్థాన్)
Q8. భారత్లో 2050 నాటికి పట్టణ జనాభా ఎంత శాతానికి పెరగనుంది.?
జ:- 50 శాతానికి
Q9. ప్రాజెక్ట్ 75 లో భాగంగా తయారైన చిట్టచివరి సబ్ మెరైన్ పేరు ఏమిటి
జ :- వాగ్ షీర్
Q10. స్పేస్ టెక్ పాలసీని విడుదల చేసిన రాష్ట్రం ఏది.?
జ:- తెలంగాణ
Q11. ధర్మల్ విద్యుత్ కేంద్రాలలో బయోమాస్ పెల్లట్లను ఉపయోగించాలి అని నిర్ణయించిన రాష్ట్రం ఏది.?
జ :- తెలంగాణ
Q12. వైద్య వైద్య పరికరాల తయారీ కేంద్రం “ప్రాజెక్టు సంజీవని” కేటీఆర్ ఎక్కడ ప్రారంభించారు.?
జ :- సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో
Q13. తాజాగా తెలంగాణలో రెండు వందల కోట్లతో పరిశ్రమను స్థాపించనున్న సంస్థ ఏది.?
జ :- భారత్ సీరమ్స్
Q14. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ :- కేసలి అప్పారావు
Q15. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం గత తొమ్మిదేళ్ళలో భారత్లో పేదరికం ఎంత శాతం తగ్గింది.?
జ :- 12.3%.
Q16. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు.?
జ :- ఏప్రిల్ 18
Q17. అంబేద్కర్ జన్మించిన ఏ ప్రాంతాన్ని దర్శనీయ స్థలంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు .?
జ :- మౌ
Q18. హిమాచల్ప్రదేశ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు.?
జ :- ఏప్రిల్ 15