1) ఇటీవల ‘ఇంటర్ రైల్వే అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్’లో పురుషుల 100 మీటర్ల రేసులో జాతీయ రికార్డును ఎవరు సృష్టించారు?
జ – అమ్లాన్ బోర్గోహైన్.
2) ఇటీవల ‘పార్లమెంట్ టీవీ’ CEO గా ఎవరు నియమితులయ్యారు?
జ – ఉత్పల్ కుమార్ సింగ్.
3) ఇటీవల ప్రపంచ జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు?
జ : అపేక్ష ఫెర్నాండెజ్.
4) ఏ దేశం ఇటీవల నిర్వహించిన ‘వోస్టాక్’ సైనిక వ్యాయామంలో, భారత సైన్యం పాల్గొంది?
జ – రష్యా.
5) ఏ దేశంలో జరగనున్న ‘వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్‌షిప్ 2023’ వాయిదా వేయబడింది?
జ – చైనా.
6) ఇటీవల ప్రధానమంత్రి మోడీ INS విక్రాంత్‌ను భారత నౌకాదళానికి ఎక్కడ అప్పగించారు?
జ – కొచ్చి.
7) ఏ బ్యాంక్ ఇటీవల క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్‌ని ప్రారంభించింది?
జ – SBI.
8) ఇటీవల ఏ దేశ మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ మరణించారు?
జ – రష్యా.
9) ఏవరి నివేదిక ప్రకారం భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఆవిర్భావించింది.?
జ : బ్లూమ్ బర్గ్
10) ప్రపంచంలో మొదటి నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లు ఏవి.?
జ : అమెరికా, చైనా, జపాన్, జర్మనీ
11) వారంలో ఒకరోజు పాఠశాలలో నో బ్యాగ్ డే అమలు చేయాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది.?
జ : మధ్యప్రదేశ్
12) నాసా తాజాగా వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఏ గెలాక్సీ యొక్క చిత్రాలను విడుదల చేసింది.?
జ : ఫాంటామ్
13) ఆగస్టు నెలలో వసూలు అయినా జీఎస్టీ ఎంత.?
జ : 1,43,612 కోట్లు
14) ఇటీవల మరణించిన షేక్ ఆలీ ఏ రంగంలో ప్రసిద్దుడు.?
జ : చరిత్రకారుడు
15) AICTE హెడ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జగదీష్ కుమార్ (UGC చైర్మన్)
16) సప్లయ్ చైన్ ఫైనాన్స్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇండస్ ఇండ్ బ్యాంకు ఏ బ్యాంకు తో ఒప్పందం చేసుకుంది.?
జ : ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ADB)
17) ఆల్ ఇండియా పుట్ బాల్ ఫెడరేషన్ (AIFF) అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : కళ్యాణ్ చౌబే
18) ONGC తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : రాజేష్ కుమార్ శ్రీవాస్తవ
19) “indian banking in retrospect – 75 years of independence” పుస్తక రచయిత ఎవరు.?
జ : డా. ఆశుతోష్ రారవికర్
20) కేంద్ర కేబినెట్ కమిటీ ఏ యుద్ధ విమానాల తయారీకి అనుమతి ఇచ్చింది.?
జ : LCA MARK 2 FIGHTER AIRCRAFT