BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th SEPTEMBER 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th SEPTEMBER 2024
1) తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా ఎవరిని నిరమించారు.?
జ : అరికెపూడి గాంధీ
2) క్యాన్సర్ మందులపై జీఎస్టీని 12 శాతం నుంచి ఎంత శాతానికి తగ్గించారు.?
జ : 5 శాతానికి
3) ఎంపిక చేసిన స్నాక్స్‌పై జీఎస్టీ ని 18 శాతం నుంచి ఎంత శాతానికి తగ్గించారు.?
జ : 12 శాతంకు
4) కేదార్‌నాథ్, బద్రీనాథ్ తదితర తీర్థయాత్రలకు భక్తులను తీసుకెళ్లే హెలికాప్టర్ సేవలపై పన్ను 18శాతం నుంచి ఎంత శాతానికి తగ్గించారు.?
జ : 5శాతానికి
5) చైనా, వియాత్నాంలలో ఇటీవల తీవ్ర నష్టం మిగిల్చిన టైపూన్ ఏది.?
జ : టైపూన్ యాగి
6) 2027 నాటికి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎవరు నిలవనున్నట్లు ఇన్‌ఫార్మా కనెక్ట్ అకాడమీ తెలిపింది.?
జ : స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్
7) భారత్ నుంచి తొలి ట్రిలియనీర్‌గా ఎవరు నిలవనున్నట్లు ఇన్‌ఫార్మా కనెక్ట్ అకాడమీ తెలిపింది.?
జ : గౌతమ్ అదాని
8) యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : జాన్నిక్ సిన్నర్. (ఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్‌పై 6-3, 6-4,7-5 స్కోరు తేడాతో విజయం సాధించాడు.)
9) పారా ఒలింపిక్స్ 2024 లో మొదటి మూడు స్థానాలలో నిలిచిన దేశాలు ఏవి.?
జ : చైనా, బ్రిటన్, అమెరికా
10) పారా ఒలింపిక్స్ 2024 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 18వ స్థానం (29 పతకాలు)
11) ఇంగ్లండ్ తరపున 100వ పుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్న 10వ ఆటగాడు ఎవరు.?
జ : హ్యారీ కేన్
12) 2026 ఎషియాడ్ గేమ్స్ కు ఏ దేశం ఆతిధ్యం ఇస్తుంది.?
జ : జపాన్