Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th FEBRUARY 2024

1) 2023 – 2024 ల మధ్య ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఎంత మేర పరిమితిని దాటాయని యూరోపియన్ క్లైమేట్ ఏజెన్సీ ప్రకటించింది.?
జ : 1.52 డిగ్రీస్ సెంటీగ్రేడ్

2) 2024లో కేంద్రం ఎంతమందికి బాల పురస్కారం అవార్డులను ప్రకటించింది.?
జ : 19 మంది

3) నేషనల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద దేశవ్యాప్తంగా కేంద్రం ఎన్ని కారుడారులను గుర్తించింది.?
జ : 11

4) భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏ సంవత్సరం వరకు ప్రారంభించాలని కేంద్రం నిలయం తీసుకుంది.?
జ : 2028

5) తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2023 – 24 గాను ఎంతగా నమోదయింది.?
జ : 3,43,287

6) అమెరికాలోని న్యూయార్క్ తూర్పు జిల్లా న్యాయమూర్తిగా నియమితులైన తొలి ప్రవాస భారతీయుడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : సంకేత్ జయోశ్ బల్వారా

7) ఈ నగరంలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 108 రెక్కల గల కమలం పువ్వును అభివృద్ధి చేసి దానికి ‘నమో 108’ అని పేరు పెట్టింది.?
జ : లక్నో

8) నరేంద్ర మోడీ తెలంగాణలోని ఏ రైల్వే టెర్మినాలను త్వరలో ప్రారంభించనున్నారు.?
జ : చర్లపల్లి రైల్వే టెర్మినల్

9) ఆస్ట్రేలియా పార్లమెంటును ఉద్దేశించి మొట్టమొదటిసారి మాట్లాడిన మొదటి పసిఫిక్ దేశాల ప్రధాన మంత్రి గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : జేమ్స్ మార్పే (న్యూగినియా)

10) భారతరత్న అవార్డు అందుకున్న పీవీ నరసింహారావు భారతదేశానికి ఏ కాలంలో ప్రధానమంత్రిగా పనిచేశారు.?
జ : 1991 నుండి 1996

11) పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన సంస్కరణలకు ఏమని పేరు ఉండేది.?
జ : LPG ( లిబరలైజేషన్ – ప్రైవేటైజేషన్ – గ్లోబలైజేషన్)

12) లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 38 (సింగపూర్ మొదటి స్థానం)

13) ‘AI & NATIONAL SECURITY’ అనే పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారు.?
జ : అనిల్ చౌహాన్

14) భారత ప్రభుత్వం మయన్మార్ తో సరిహద్దు వెంబడి పూర్తిగా కంచె వేయాలని నిర్ణయించింది. ఈ సరిహద్దు పొడవు ఎంత.?
జ : 1,643 కిలోమీటర్లు

15) వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 ఫిబ్రవరి 12 నుండి ఎక్కడ ప్రారంభం కానుంది.?
జ : దుబాయ్