BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th AUGUST 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th AUGUST 2024
1) తాము ధరించే దుస్తులను ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థినులకు ఉండాలని హీజాబ్ సర్కులర్ పై ఏ కోర్టు స్టే విధించింది.?
జ : సుప్రీం కోర్టు
2) ఏ పథకం ద్వారా గ్రామాల్లో మరో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.?
జ : ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం
3) బాలికల కనీస వివాహ వయసును 18 నుంచి 9 ఏండ్లకు, బాలుర వివాహ వయసును 15కు తగ్గిస్తూ ఏ దేశ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టింది.?
జ : ఇరాక్ ప్రభుత్వం
4) అంతరించిపోతున్న దశలో ఉన్న 10 లక్షల జీవ జాతుల కొరకు ఎక్కడ లైఫ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు.?
జ : చంద్రుడిపై
5) యుద్ధ క్షేత్రంలోకి రోబో శునకాలను ఆవిష్కరించిన దేశం ఏది.?
జ : ఉక్రెయిన్.
6) అత్యవసర సహాయ సామగ్రిని అందించడానికి అమెజాన్ హబ్స్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.?
జ : హైదరాబాద్‌లో
7) ఆగస్టు రెండో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు ఎంతకు పెరిగాయి.?
జ : 675 బిలియన్ డాలర్లకు
8) పారిస్ ఒలంపిక్స్ 2024లో ఏ భారత్ రెజ్లర్ కాంస్య పతకం సాధించాడు.?
జ : అమన్ షెహ్రవత్
9) పురుషుల 89 కిలోల విభాగంలో ఏకంగా 404 కిలోల బరువును ఎత్తి ఒలింపిక్ రికార్డులతో పాటు ప్రపంచ రికార్డుల ను బ్రేక్ చేసిన బల్గేరియా వెయిట్ లిఫ్టర్ ఎవరు.?
జ : కార్లొస్ నాసర్ (21 ఏళ్ళు)
10) ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత మువ్వన్నెల పతకాన్ని చేతబూనే అవకాశం ఎవరికి దక్కింది.?
జ : మను భాకర్ & పీఆర్ శ్రీజేష్
11) సుప్రీంకోర్టులో ఇటీవల ఏ చిత్రాన్ని ప్రదర్శించారు.?
జ : ‘లాపతా లేడీస్’
12) అమెరికా జాతీయ పక్షి గా దేనిని ఖరారు చేశారు.?
జ : బాల్డ్ ఈగల్