TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th APRIL 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th APRIL 2024

1) ఎటీపీ టూర్ ర్యాంకింగులలో నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన అతిపెద్ద వయస్కుడిగా ఎవరు రోజర్ పెదరర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు.?
జ : నోవాక్ జకోవిచ్

2) రాజీనామా చేసిన పేటీఎం ఎండి, సీఈఓ ఎవరు.?
జ : సరీందర్ చావ్లా

3) దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఏ తెలుగు అమ్మాయికి హార్వార్డ్ యూనివర్సిటీ అందజేసింది.?
జ : అవంతిక వందనపున

3) ద్రవ్యరాశి కణ సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన ఏ నోబెల్ గ్రహితం మరణించారు.?
జ : పీటర్ హిగ్స్

4) అమెరికా కు చెందిన ప్రతిష్టాత్మక జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ పురష్కారం ఇస్రోకు ఏ ప్రాజెక్టును విజయవంతం చేసినందుకు అందజేశారు.?
జ : చంద్రయాన్ – 3

5) ఏటీపీ మాస్టర్స్ టోర్నీ లో ఒక మ్యాచ్ నెగ్గిన తొలి భారతీయ ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : సుమిత్ నగాల్

6) ఆసియా ఓషియానియా ఆల్ట్రా రన్నింగ్ ఛాంపియన్ షిప్ 2024 విజేతగా ఏ దేశం నిలిచింది.?
జ : భారత్

7) BSE లో మదుపర్ల సంపద విలువ 400 లక్షల కోట్లకు ఏరోజు చేరుకుంది.?
జ : ఏప్రిల్ 8 – 2024

8) భారతదేశంలో మొట్టమొదటి మహిళా పిచ్ క్యూరేటరుగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : బసింత కళ్యాణ్

9) కేంద్రం ప్రారంభించిన గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం ఎప్పటి వరకు కర్బన ఉధ్గారాలను జీరో స్థాయికి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : 2070

10) హూరూన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 లో మొదటి మూడు స్థానాలలో ఉన్న దేశాలు ఏవి.?
జ : అమెరికా, చైనా, భారత్

11) 16వ ఆర్థిక సంఘం సభ్యుడిగా తాజాగా ఎవరిని కేంద్రం నియమించింది.?
జ : మనోజ్ పాండా

12) చరిత్రలో అత్యంత వేడి నెలగా ఏ నెల తాజాగా రికార్డు సృష్టించింది.?
జ : మార్చి 2024

13) అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణ మండలి సభ్యురాలిగా ఏ భారతీయురాలు ఎన్నికయ్యారు.?
జ : జగజీత్ పవాడియా

14) ఇంగ్లాండ్ కరెన్సీ నోట్లపై ఎలిజిబెత్ రాణి 2 ఫోటోకు బదులుగా తాజాగా ఎవరి ఫోటోను ముద్రించారు.?
జ : కింగ్ చార్లెస్ – 3

15)యువత ఏ మాదకద్రవ్యం వాడకం వలన దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు సియోర్రా లియోన్ దేశాధ్యక్షుడు ప్రకటించారు.?
జ : కుష్