Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th APRIL 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th APRIL 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th APRIL 2024

1) ఎన్నికలలో అసత్య వార్తలను నిషేధించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన నూతన వెబ్సైట్ పేరు ఏమిటి.?
జ : మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్ట్రర్

2) లామిటీయో 2024 పేరుతో ఏ దేశాల మధ్య సైనిక విన్యాసాలు ఇటీవల నిర్వహించారు.?
జ : భారత్ షీసిల్స్

3) 2012 – 2022 వరకు జిఎస్డీపీ, తలసరి ఆదాయం పెరుగుదల గురించి ఎస్బిఐ విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : GSDP – 4వ స్థానం
తలసరి ఆదాయం – 3వ స్థానం

4) ఆయుర్వేద మద్యం తయారు చేసిన తెలంగాణ డిస్టల్లరీ ఏది.?
జ : బయో లిక్కర్స్ & డిస్టల్లరీస్

5) ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవినెట్ కార్యక్రమ ఉద్దేశ్యం ఏమిటి.?
జ : సార్స్ కోవ్ – 2, మెర్స్ కోవ్, కరోనా కొత్త జాతులను గుర్తించుట

6) చంద్రుని పై మొక్కలు పెంపకం చేపట్టాలని ఏ సంస్థ నిర్ణయం తీసుకుంది.?
జ : నాసా

7) చంద్రుని పై ఏ మొక్కలు పెంచలాని నాసా నిర్ణయం తీసుకుంది.?
జ : డక్‌వీడ్, క్రెస్, బ్రాసికా

8) గాలిలో డీఎన్ఏ ను విశ్లేషించి నేరగాళ్లను పట్టుకునే టెక్నాలజీ ని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.?
జ : ఆస్ట్రేలియా

9) కోడి ఈకలతో సింథటిక్ ప్లాస్టిక్ తయారు చేయడానికి ఏ సంస్థ నిర్ణయం తీసుకుంది.?
జ : ఐఐసీటీ హైదరాబాద్

10) లోక్‌సభ ఎన్నికలకు యూత్ ఐకాన్ గా కేంద్ర ఎన్నికల సంఘం ఎవరిని నియమించింది.?
జ : ఆయుష్మాన్ ఖురానా

11) టీట్వంటీ లలో 150 మ్యాచ్ లు గెలిచిన మొదటి జట్టు గా ఏ జట్టు నిలిచింది.?
జ : ముంబై ఇండియన్స్

12) టాటా కు చెందిన ఏ ఉపగ్రహంను ఫాల్కన్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి విజయవంతంగా పంపారు.?
జ : TSAT – 1A

13) ఎప్రిల్ 8న ఎక్కడ సంపూర్ణ సూర్య గ్రహణం కనిపించింది.?
జ : ఉత్తర అమెరికా

14) స్లోవేకియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : పీటర్ పెల్లెగ్రీని

15) విప్రో నూతన సీఈవో గా ఎవరు నియమితులయ్యారు.?
జ : శ్రీనివాస్ పల్లియ