Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th AUGUST 2024

1) ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌’ ఈవోఎస్‌-08 ప్రయోగాన్ని ఏరోజు చేపట్టబోతున్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం వెల్లడించింది.?
జ : ఆగస్టు 15న

2) మొట్ట మొదటి ‘విజ్ఞాన్‌ రత్న’ పురస్కారానికి ఎంపిక అయ్యారు.?
జ : ప్రముఖ జీవరసాయన శాస్త్రవేత్త (బయో కెమిస్ట్‌) గోవిందరాజన్‌ పద్మనాభన్‌

3) భూగోళంపై 7 ఖండాలు లేవని, ప్రస్తుతానికి 6 ఖండాలే ఉన్నాయని నూతన అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు. ఏ ఖండాలు ఇంకా వేరుపడలేదని ప్రకటించారు.?
జ : ఉత్తర అమెరికా, యూరప్‌

4) యూట్యూబ్ షార్ట్స్ కు ఎన్ని కోట్ల వ్యూవ్స్ వచ్చినట్లు యూట్యూబ్ ప్రకటించింది.?
జ : లక్ష కోట్ల

5) వినేశ్‌ పోగట్ ఎంత ఆధిక బరువు కారణంగా దూరం అయింది.?
జ : 100 గ్రాముల

6) అధిక బరువు కారణంగా ఏ భారత మహిళా రెజ్లర్ పై పారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడింది.?
జ : వినేశ్‌ పోగట్

7) రెజ్లింగ్ కు వీడ్కోలు పలికిన ప్రఖ్యాత క్రీడాకారిణి ఎవరు.?
జ : వీనెశ్ పోగట్

8) శ్రీలంక తో వన్డే సిరీస్ ను ఎంత తేడాతో భారత్ఓడిపోయింది.?
జ : 2-0 తేడాతో

9) ఎన్ని సంవత్సరాల తర్వాత లంకపై వన్డే సిరీస్ ఓటమిని భారత్ చవిచూసింది.?
జ : 27 సంవత్సరాల తర్వాత

10) హమాస్ నూతన చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : యహ్య సిన్వర్

11) ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ సాహిత్య పురష్కారం 2024 ఎవరికి ప్రకటించారు.?
జ : కవి అఫ్సర్

12) మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రధానమంత్రి గా ఎవరు నిలిచారు.?
జ : నరేంద్ర మోదీ (69%)

13) ప్రపంచంలో అతిపెద్ద (425 మీటర్లు) హైపర్ లూప్ ట్యూబ్ ను ఏ ఐఐటీ తయారు చేసింది.?
జ : ఐఐటీ మద్రాస్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు