TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th MAY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th MAY 2024

1) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం గృహ రుణాలు ఎన్ని లక్ష కోట్లకు చేరాయి.?
జ : 27 లక్షల కోట్లు

2) మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2024 మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ఇగా స్వియాటెక్ (సబలెంక పై)

3) ఏ అంతర్జాతీయ మీడియా సంస్థను తమ దేశంలో పూర్తిగా నిషేదిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : అల్ జజీరా

4) అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న కొత్త కోవిడ్ వేరియెంట్ ఏమిటి.?
జ : ప్లర్ట్

5) ఐసీసీ మహిళల టి20 వరల్డ్ కప్ 2024 ఏ దేశంలో జరగనుంది.?
జ : బంగ్లాదేశ్

6) థామస్, ఉబర్ కప్ లను కైవసం చేసుకున్న దేశం ఏది.?
జ : చైనా

7) పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మహిళ ఎవరు.? ఆ దేశంలో ముఖ్యమంత్రి అయిన తొలి మహిళ ఈమె కావడం గమనార్హం.
జ : మరియం నవాజ్ (నవాజ్ షరీఫ్ కుమార్తె)

8) జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ తాజాగా ఏ ప్రముఖ రెజ్లర్ పై నిషేధం విధించింది.?
జ : భజరంగ్ పూనియా

9) ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు.?
జ : హరీష్ కుమార్ గుప్తా

10) మూడోసారి అంతరిక్షంలోకి వెళుతున్న సునితా విలియమ్స్ తన వెంట ఏ దేవుడి ప్రతిమను తీసుకెళ్తున్నారు.?
జ : గణనాథుడు

11) సునీత విలియమ్స్ ఏ సంవత్సరాలలో అంతరిక్ష యానం చేశారు.?
జ : 2006, 2012, 2024

12) ఏ దేశం రష్యా లోని తన రాయబారిని వెనక్కి పిలిపించింది.?
జ : జర్మనీ

13) అంతర్జాతీయ మొబైల్ నెంబర్ తో యూపీఐ చెల్లింపులు చేసేలా అవకాశం కల్పిస్తున్నట్లు ఏ బ్యాంకు ప్రకటించింది.?
జ : ఐసిఐసిఐ