TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th JUNE 2024

1) పుట్‌బాల్ క్రీడకు వీడ్కోలు పలికిన సునీల్ ఛెత్రి ఎన్ని అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి, ఎన్ని గోల్స్ చేశాడు.?
జ : 151 మ్యాచ్ లు – 94 గోల్స్

2) ఫ్రెంచ్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ ఫైనల్ కు క్రీడాకారిణులు ఎవరు.?
జ : ఇగా స్వియాటెక్ & జాస్మిన్ పలోని

3) ఏ దేశ ప్రభుత్వం జననాల రేటు పెంచడానికి డేటింగ్ యాప్ ను అభివృద్ధి చేస్తుంది.?
జ : జపాన్

4) గంటకు 15,000 మైళ్ల వేగంగా ప్రయాణంచే ఏ ఖండాతర బాలిస్టిక్ క్షిపణి ని అమెరికా విజయవంతంగా ప్రయోగించింది.?
జ : మినిట్‌మన్ – 3

5) జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సదానంద్ వసంత్ దాతె

6) ఐరాస పర్యావరణ కార్యక్రమం నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు.?
జ : 78.3 కోట్లు

7) ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ADR) నివేదిక ప్రకారం తాజాగా ఎన్నికైన ఎంత శాతం ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.?
జ : 46%

8) ఐరాస భద్రతా మండలికి 2 సంవత్సరాల కాలానికి గానూ ఏ దేశాలు ఎంపిక అయ్యాయి.?
జ : పాకిస్థాన్, డెన్మార్క్, సోమాలియా, గ్రీస్, పనామా

9) మానవులను చందమామ, అంగారకుడి పైకి తీసుకుని వెళ్ళే ఏ భారీ రాకెట్ ను స్పేస్ ఎక్స్ సంస్థ విజయవంతంగా ప్రయోగించింది. ?
జ : స్టార్‌షిప్

10) ISSF షూటింగ్ ప్రపంచ కప్ .2024 లో 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో స్వర్ణం సాదించిన భారత ఆటగాడు ఎవరు.?
జ : శరభ్‌జ్యోత్ సింగ్

11) 2024 లోక్‌సభ ఎన్నికలలో నోటాకు అత్యధిక ఓట్లు పడిన నియోజకవర్గం ఏది.?
జ : ఇండోర్ (2,18,674)

12) వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి పదివేల కోట్లను ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు అందజేసింది.?
జ : హర్యానా

13) నిఫా వైరస్ లాంటి కణాలను ఏ రాష్ట్ర ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : కేరళ

14) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత నుండి ఎగుమతులు పొందిన టాప్ మూడు దేశాలు ఏవి.?
జ : అమెరికా, యూఏఈ, నెదర్లాండ్స్