BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th JULY 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th JULY 2024
1) ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2024 విజేతగా నిలిచిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : దృవ్ సిత్వాలా
2) ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నేత ఎవరు.?
జ : మసౌద్ పెజిష్కియాన్
3) కేరళలో నమోదవుతున్న మెదడు తినే అమీబా వ్యాధికి కారణమైన జీవి ఏది.?
జ : అమీబిక్ మెనింజో ఎన్‌సెఫలైటీస్
4) డి ఆర్ డి ఓ మరియు ఎల్ అండ్ టి సంస్థల సంయుక్తంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ ట్యాంక్ పేరు ఏమిటి.?
జ : జొరావర్
5) 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో భారత్ లో ఎఫ్ఎంసిజీ వృద్ధి ఎంతగా నమోదు అవ్వచ్చని క్రిసిల్ అంచనా వేసింది.?
జ : 7 నుండి 9 శాతం
6) ఇటీవల గూగుల్ మ్యాప్స్ నుండి వైదొలిగి సొంతంగా మ్యాఫ్ యాప్ ను అభివృద్ధి చేసుకున్న క్యాబ్ యాప్ ఏది.?
జ : ఓలా
7) బంధన్ బ్యాంక్ తాత్కాలిక ఎండి మరియు సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రతన్ కుమార్ కేశ్
8) ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్ లో టాప్ 25 లో నిలిచిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : మనికా బత్రా
9) పారిస్ లో జరిగే ఒలంపిక్స్ లో 28 మంది భారత అథ్లెటిక్స్ తరఫున పతాకదారిగా ఉండనున్న క్రీడాకారుడు ఎవరు.?
జ : నీరజ్ చోప్రా
10) ఎల్ఐసీ నూతన ఎండి మరియు సీఈవోగా ఎవరు నియమితులయ్యారు.?
జ : సిదార్థ మహంతీ
11) ఇరాన్ ఎన్నో అధ్యక్షుడిగా మసౌద్ పెజిస్కియాని ఎన్నికయ్యారు.?
జ : తొమ్మిదవ
12) గణాంకాల ప్రకారం ఏ జంతువు వలన ఏట అధికంగా మానవుల మరణాలు జరుగుతున్నాయి.?
జ : దోమ
13) ఇటీవల భూమికి అతి సమీపంగా దూసుకొస్తున్న గ్రహశకలం కు నాసా ఏమని పేరు పెట్టింది.?
జ : 2024 MT1
14) పోర్న్ వెబ్సైట్ ల నుండి బాలలను రక్షించడానికి పోర్న్ పాస్పోర్ట్ ను ఏ దేశం 18 సంవత్సరాలు నిండిన యువతకు అందించనుంది.?
జ : స్పెయిన్