Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th JANUARY 2024

1) 2024 టీట్వంటీ వరల్డ్ కప్ కు.ఆతిధ్యం ఇస్తున్న దేశాలు ఏవి.?
జ : అమెరికా, వెస్టిండీస్

2) మంత్రి ని తొలగించే అధికారం గవర్నర్ కు లేదు అంటూ సుప్రీం కోర్టు ఏ కేసు సందర్భంగా ఇటీవల తీర్పునిచ్చింది.?
జ : తమిళనాడు కేసు

3) మంచుగడ్డలలో 3 గంటలపాటు ఉండి గిన్నిస్ రికార్డు సృష్టించిన పోలాండ్ దేశస్తుడు ఎవరు.?
జ : వలెర్జన్ రోమనోస్క్వీ

4) అగ్ని పర్వతం నుండి విద్యుత్ ఉత్పత్తి చేపట్టనున్నట్లు అమెరికాకు చెందిన ఏ స్టార్టప్ కంపెనీ ప్రకటించింది.?
జ : క్వాయిన్ ఎనర్జీ

5) ఆదిత్య ఎల్ – 1 ప్రయోగానికి నేతృత్వం వహించిన మహిళ సైంటిస్ట్ ఎవరు.?
జ : నిగార్ సాజీ

6) ఆదిత్య ఎల్ – 1 ను ఏ కక్ష్యలోకి ప్రవేశపెట్టినారు.?
జ : లాంగ్రేజియన్ పాయింట్ – 1

7) ఎక్కడ నిర్వహించాల్సిన ఫార్ములా ఈ రేసు ను ఎఫ్ఐఏ రద్దు చేసుకుంది.?
జ : హైదరాబాద్

8) ప్రపంచ ఆరోగ్య సంస్థకు సలహాదారు గా నియమించబడిన ఖమ్మం జిల్లా వాసి ఎవరు.?
జ : అడపా కార్తీక్

9) ఆల్ ఇండియా రబ్బరు ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : శశి సింగ్

10) ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి – 04

11) కర్ణాటక కురుబల సంఘం అందించే ‘మా జాతి సూర్యుడు’ 2023 అవార్డు అందుకున్న తెలుగు వ్యక్తి ఎవరు.?
జ : కంచె ఐలయ్య

12) రోమ్ దేశంలో మిషనరీస్ ఆఫ్ ఫెయిత్ జనరల్ కౌన్సిలర్ ఎంపికైన తొలి భారతీయుడు ఎవరు.?
జ : పాదర్ మెరియో

13) ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2023 కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : బీఆర్ కాంబోజ్

14) గ్లోబల్ ఫ్యామిలీ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 01

15) పులుల వలన మరణాలలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ: మహారాష్ట్ర

16) భేటీ బచావో భేటీ పడావో బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ :పింకీ

17) కువ్వెంపు నేషనల్ అవార్డు 2023 కు ఎంపికైంది ఎవరు.?
జ : సిర్సెందూ ముఖోఫాద్యాయ్

18) స్కాటిష్ జూనియర్ ఓపెన్ U19 – 2023 టైటిల్ గెలుచుకున్న ఆటగాడు ఎవరు.?
జ : ఆనంత్ సింగ్