BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th AUGUST 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th AUGUST 2024
1) బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్
2) బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు.?
జ : మొహమ్మద్ షహాబుద్దిన్
3) అమెరికా డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎవరిని కమలా హారిస్ ఎంపిక చేసుకున్నారు.?
జ : మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్
4) ఫిజి దేశపు ఏ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆ దేశ ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ప్రదానం చేసింది.?
జ : ‘ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి’
5) షేక్ హసీనాను గద్దె దింపడంలో ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు ఎవరు.?
జ : నహిద్ ఇస్లామ్.
6) బంగ్లాదేశ్ జైలులో ఉన్న ఏ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నేతను రిలీజ్ చేయాలని దేశాధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దిన్ ఆదేశించారు.?
జ : ఖలీదా జియా
7) దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్‌గా ఎవరి నియామకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.?
జ : చల్లా శ్రీనివాసులు శెట్టి
8) ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా రెజ్లర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : వినేశ్ పోగట్
9) ఒక ఏడాదికి ఎన్ని వేల కోట్ల జీఎస్టీని బీసీసీఐ కడుతుంది.?
జ : 2 వేల కోట్లు
10) భారతదేశం లో నల్లా కనెక్షన్లు ఉన్న ఇళ్ళ శాతం?
జ : 77.83%
11) ఆంధ్రప్రదేశ్ లో నల్లా కనెక్షన్లు ఉన్న ఇళ్ళ శాతం?
జ : 73.48%
12) తెలంగాణలో నల్లా కనెక్షన్లు ఉన్న ఇళ్ళ శాతం?
జ : 100%
13) గత ఐదేళ్లలో రద్దు చేసిన రుణాలు ఎన్ని లక్షల కోట్లు.?
జ : 9.9 లక్షల కోట్లు