BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th SEPTEMBER 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th SEPTEMBER 2024
1) హైదరాబాద్ నగరాన్ని కృత్రిమ మేధస్సు(ఏఐ) అంతర్జాతీయ సదస్సు 2024 ఎక్కడ జరిగింది.?
జ : హైదరాబాద్
2) భారత్‌లో త్వరలోనే ఏ సైజ్ లో దుస్తులను అందుబాటులో తేవడానికి కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ కొత్త ప్రాజెక్టును చేపట్టనుంది?
జ : ఇండియా సైజ్
3) దేశంలోని ఎన్ని కోట్ల మంది రైతులకు ఆధార్ తరహాలో డిజిటల్ ఐడీలు జారీచేయాలని కేంద్రం నిర్ణయించింది. ?
జ : 11 కోట్ల మందికి
4) గత పదేండ్లలో భారత్ లో సౌరశక్తి సామర్ధ్యం ఎన్ని రెట్లు పెరిగింది.?
జ : 32 రెట్లు
5) ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్‌ను ఏ దేశ శాస్త్రవేత్తలు అబివృద్ది చేశారు.?
జ : అమెరికా
6) పారిస్ పారా ఒలింపిక్స్ లో క్లబ్ త్రోలో స్వర్ణ, రజతాలు గెలిచిన భారత క్రీడాకారులు ఎవరు.?
జ : ధరంబీర్ సింగ్, సూర్మ ప్రణవ్.
7) పారా ఒలింపిక్స్ లో జూడోలో కాంస్య పతకం నెగ్గిన భారత క్రీడకారుడు ఎవరు.?
జ : కపిల్ పర్మార్
8) 2026 పొట్టి ప్రపంచకప్ కోసం ఐసీసీ నిర్వహిస్తున్న ఆసియా క్వాలిఫయర్స్ టోర్నీలో భాగంగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏ జట్టు 10 పరుగులకే ఆలౌట్ అయింది.?
జ : మంగోలియా
9) 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత క్రీడాకారుల్లోనే అత్యధికంగా ట్యాక్స్ పే చేసిన క్రికెటర్‌గా ఎవరు నిలిచారు.?
జ : విరాట్ కోహ్లీ
10) 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా ట్యాక్స్ కట్టిన స్టార్స్ లిస్ట్‌ను ఫార్చ్యూన్ ఇండియా తాజాగా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. భారతీయ సెలబ్రిటీలందరిలో అత్యధికంగా పన్ను చెల్లించినవారు ఎవరు.?
జ : షారుక్ ఖాన్
11) కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ సెక్రటేరియట్ ప్రారంభం కోసం ఏ దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.?
జ : భారత్, శ్రీలంక, మారిసస్, మాల్దీవులు
12) ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : తేజేంద్ర సింగ్