BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th AUGUST 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th AUGUST 2024
1) హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ఏ సంస్థ ప్రకటించింది.?
జ : కాగ్నిజెంట్
2) స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఎవరిని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు.?
జ : మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా
3) వచ్చే ఐదేండ్లలో వీ హబ్‌లో రూ.42 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన ఏ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.?
జ: వాల్ష్ కర్రా హోల్డింగ్స్
4) ఏసీ కొనాలంటే 50 మొక్కలు నాటాలంటూ ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : రాజస్దాన్
5) బంగ్లాదేశ్‌లో చెలరేగుతున్న హింస కారణంగా ఆ దేశ ప్రధాని రాజీనామా చేశారు. ఆమె పేరు ఏమిటి.?
జ : షేక్ హసీనా
6) ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్ నుంచి 86 వ ర్యాంక్‌ను పొందిన సంస్థ ఏది.?
జ : రిలయన్స్ ఇండస్ట్రీస్
7) డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం ఎంతకు పడిపోయింది.?
జ : 84.09
8) పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిణిగా వ్యవహరించనున్నారు.?
జ : మనూభాకర్
9) దక్షిణాఫ్రికా 20 (SA20) లీగ్‌కు అంబాసిడర్‌గా ఎవరు వ్యవహరించనున్నారు.?
జ : దినేష్ కార్తిక్
10) ఇంగ్లండ్ క్రికెట్ మాజీ ఆల్‌రౌండర్ కన్నుమూశారు. అతని పేరు ఏమిటి.?
జ : గ్రాహమ్ థోర్పె
11) ఆర్మీ మెడికల్ సర్వీసెస్ ఈజీగా ఎవరు నియమితులయ్యారు .?
జ : సాధన సక్సేనా
12) ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలంపియాడ్ 2024 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : నాలుగవ స్థానం
13) అయోధ్య రాముడి ఫోటోతో పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన దేశం ఏది.?
జ : లావోస్
14) అస్సాం రైఫిల్స్ కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరు.?
జ : విసాక్ లఖెరా