BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th SEPTEMBER 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th SEPTEMBER 2024
1) తెలంగాణ రాష్ట్రం లోని ఏ అడవుల్లో సుడిగాలి బీభత్సం కారణంగా ఒకే ఏరియాలో 50వేలకు పైగా చెట్లు నేలమట్టం అయ్యాయి.?
జ : మేడారం అడవుల్లో
2) ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది.?
జ : భారత్
3) భారత్ ప్రతి ఏడాది ఎన్ని మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నది.?
జ : 10.2 మిలియన్ టన్నులు
4) ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించి అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు పింఛన్ ఇవ్వొద్దని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.?
జ : హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం
5) హిమాలయాల మంచు పొరల్లోఎన్ని రకాల ప్రాచీన వైరస్‌లు గుర్తించారు.?
జ : 1700 రకాలు
6) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా ఏఏ దేశాలలో పర్యటించారు.?
జ : బ్రూనై, సింగపూర్
7) ఆఫ్రికా దేశం నైజీరియాలో మిలిటెంట్లు కాల్పులు కారణంగా కనీసం 100మందికిపైగా మరణించారు.?
జ : బోకో హరామ్ మిలిటెంట్లు
8) దాదాపు 30 మంది అధికారులను వరదల సమయంలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఏ దేశంలో ఉరి తీశారు.?
జ : ఉత్తర కొరియా
9) పారిస్ పారా ఒలింపిక్స్ లో ఆర్చరీలో భారత్‌కు తొలి పసిడిని ఏ ఆటగాడు అందించాడు.?
జ : హర్విందర్‌సింగ్
10) పారిస్ పారా ఒలింపిక్స్ లో పురుషుల హైజంప్ (టీ63)లో రజత, కాంస్యాలు గెలిచిన భారత ఆటగాళ్లు ఎవరు. ?
జ : శరద్ కుమార్, తంగవేలు మరియప్పన్
11) పారిస్ పారా ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో వెండి, కాంస్యాలను గెలిచిన ఆటగాళ్లు ఎవరు.?
జ : అజిత్, సుందర్
12) పారిస్ పారా ఒలింపిక్స్ లో పురుషుల షాట్‌పుట్ (ఎఫ్46)లో సిల్వర్ గెలిచిన ఆటగాడు ఎవరు.?
జ : సచిన్ ఖిలారి
13) సర్వేపల్లి రాధకృష్ణ జయంతి సందర్భంగా ఏరోజును జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 05