BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd SEPTEMBER 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd SEPTEMBER 2024
1) తోడేళ్లు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ఏ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.?
జ : ఉత్తర ప్రదేశ్
2) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అత్యాచార నిరోధక బిల్లు ను ఏ పేరుతో శాసన సభలో ప్రవేశపెట్టింది.?
జ : ‘అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్’ బిల్లు
3) డెంగ్యూని ఎపిడెమిక్‌గా ఏ రాష్ట్రం ప్రకటించింది..?
జ : కర్ణాటక
4) భూమి నుంచి చూసే వారికి ఎప్పటి వరకు శని గ్రహం చుట్టూ ఎలాంటి వలయాలు కనిపించవని తెలిపారు.?
జ : 2025 మార్చి నాటికి
5) జైలును బద్దలు కొట్టి తప్పించుకునేందుకు యత్నంలో తొక్కిసలాటలో 129 మంది ఖైదీలు ఏ దేశంలో మృతి చెందారు.?
జ : డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో
6) భారత్ 2024 – 25 లో ఎంత శాతం వృద్ధి సాదిస్తుందని వరల్డ్ బ్యాంక్ తాజాగా అంచనా వేసింది.?
జ : 7.0 శాతం
7) తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఏ దేశం పై టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. ?
జ : పాకిస్థాన్ పై
8) భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎవరిని కొత్త సెలెక్టర్‌గా నియమించింది.?
జ : అజయ్ రాత్రా
9) పారా ఒలింపిక్స్‌లో కాంస్యం సాదించిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు.?
జ : దీప్తి జివాంజీ (మహిళల 400 మీటర్ల పరుగు పందెం(టీ20)లో దీప్తి.. 55.82 సెకన్లలో పరుగును పూర్తిచేసి మూడో స్థానాన్ని దక్కించుకుని కాంస్యంతో సత్తా చాటింది.)
10) తాజాగా నవరత్న హోదా పొందిన కంపెనీలు ఏవి.?
జ : రైల్ టెల్, NHPC, SJVN, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్
11) నవరత్న హోదా పొందిన కంపెనీలు ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా పెట్టబడులు పెట్టవచ్చు.?
జ : 1,000 కోట్లు