TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd JANUARY 2024
1) ఆమెరికా దేశపు అప్పు ఎంతగా అమెరికా ట్రెజరీ శాఖా వెల్లడించింది..?
జ : 2,832 లక్షల కోట్లు
2) టైటానిక్ కంటే ఐదు రెట్లు పెద్దదైనా క్రూయిజ్ షిప్ పేరు ఏమిటి.?
జ : ఐకాన్ ఆఫ్ ద సీస్
3) జీశాట్ – 20 సమాచార ఉపగ్రహ ప్రయోగం కోసం ఇస్రో ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : స్పేస్ ఎక్స్ (ఫాల్కన్ – 9 రాకెట్ ద్వారా)
4) లాన్సెట్ నివేదిక ప్రకారం 2019 లో ఎంతమంది క్యాన్సర్ బారిన పడ్డారు మరియు ఎంతమంది మరణించారు.?
జ : 12 లక్షలు & 9.3 లక్షలు
5) లాన్సెట్ నివేదిక ప్రకారం క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య మరియు మరణాల విషయంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : రెండవ స్థానం
6) అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లో ఏ దేశపు జట్టు భారత మీద అత్యల్ప స్కోరుకే ఆల్ అవుట్ అయింది.?
జ : దక్షిణాఫ్రికా – 55
7) అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లో ఒకేరోజు అత్యధిక వికెట్లు (25) పడిన సందర్భం 1902 తర్వాత ఎప్పుడు నమోదయింది.?
జ : 2024 (23 వికెట్లు సౌతాఫ్రికా – ఇండియా)
8) ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ కోల్ కతా జట్టును ఎవరు సొంతం చేసుకున్నారు.?
జ : సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్
9) మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్రీ నివేదిక ప్రకారం ఆరుబయట జరుగుతున్న కాలుష్యం వల్ల ఏటా ప్రపంచంలో ఎంతమంది మరణిస్తున్నారు.?
జ : 83 లక్షలు
10) తక్కువ ధరలకే ఔషధాలను విక్రయించే జన ఔషధీ కేంద్రాల సంఖ్యను పదివేల నుండి ఎంతకు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : 25 వేలు
11) సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టిస్ భూషణ్ రామకృష్ణ గావాయ్
12) ఇస్రో నూతనంగా తయారు చేయనున్న భారీ రాకెట్ పేరు ఏమిటి?
జ : ఎన్ జి ఎల్ వి (New Generation Launching Vehicle)
13) ఏ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను 2,750 నుండి 3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది .?
జ :ఆంధ్రప్రదేశ్
14) ఏ దేశపు రాణి అయినా మార్గరెట్ – 2 తన పదవిని వదులుకుంది.?
జ : డెన్మార్క్
15) ఫ్లిప్ కార్ట్ సహా వ్యవస్థాపకుడు బిన్నీ భన్సాల్ తాజాగా విడుదల చేసిన స్టార్టప్ పేరు ఏమిటి.?
జ : “OppDoor”