Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd FEBRUARY 2024

1) తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎవరికి భారతరత్న అవార్డు ప్రకటించింది.?
జ : ఎల్.కే. అద్వానీ

2) ఆకాష్ క్షిపణి సహాయంతో గగన తలములోని ఎన్ని లక్ష్యాలను ఒకేసారి చేదించవచ్చు. ఈ సాంకేతికత కలిగిన మొదటి దేశం భారత్ కావడం విశేషం.?
జ : నాలుగు

3) క్రిసిల్ సంస్థ అంచనాల ప్రకారం 2024 – 2031 మధ్య భారత ఆర్థిక వృద్ధిరేటు ఎంతగా నమోదు కావచ్చు .?
జ : 6.7%

4) క్రిసిల్ సంస్థ అంచనాల ప్రకారం 2023 – 24 మరియు 2024 – 25 ఆర్థిక సంవత్సరాలలో భారత వృద్ధిరేటు ఎంతగా నమోదు కావచ్చు.?
జ : 7.1% & 6.4%

5) అద్వానికి భారతరత్న అవార్డు ఇవ్వడంతో ఇప్పటివరకు ఎంతమందికి అందజేసినట్లు అయింది.?
జ : 50

6) ఏ రాష్ట్ర గవర్నర్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.?
జ : పంజాబ్ గవర్నర్ బన్వరి లాల్

7) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన రెండవ ఆసియా బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : జస్ప్రీత్ బుమ్రా (మొదటి స్థానంలో వకార్ యూనిస్)

8) వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీ 2024 పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరఫ్ గా నిలిచిన భారత జోడి ఏది.?
జ : సాయి కార్తీక్ రెడ్డి & సిద్ధాంత భంటియా

9) కాంచన గంగ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ యానిమేషన్ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది?
జ : లచ్చిత్ ది వారియర్

10) ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 04

11) ఆరంగ్రేటంలోనే రంజి ట్రోపిలోని వరుసగా నాలుగు సెంచరీలు చేసి రికార్డు నెలకొల్పిన మిజోరం ఆటగాడు ఎవరు?
జ : అగ్ని చోప్రా

12) నేషనల్ టి20 క్రికెట్ బ్లైండ్ ట్రోపీ (నగేష్ ట్రోఫీ) విజేతగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : కర్ణాటక (ఆంధ్ర ప్రదేశ్ పై)

13) ఏ రాష్ట్రం ఇటీవల రెండు నూతన రామ్‌సర్ ప్రదేశాలను (చిత్తడి నేలలు) నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలోని అత్యధికంగా 16 రామ్‌సర్ ప్రదేశాలు కలిగిన రాష్ట్రంగా నిలిచింది.?
జ : తమిళనాడు (లాంగ్ ఉడ్ షోలా & కరవత్తి పక్షులు కేంద్రం)

14) భారత దేశంలో మొత్తం ఎన్ని రామ్‌సర్ కేంద్రాలు ఉన్నాయి.?
జ : 80