TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd APRIL 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd APRIL 2024

1) పదివేల మెగావాట్లు పునరుత్పాదక విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న తొలి దేశీయ కంపెనీగా ఏ కంపెనీ చరిత్ర సృష్టించింది ఆదాని రెన్యూవబుల్ ఎనర్జీ

2) పోర్ట్స్ 2024 బిలీనియర్ల జాబితాలో ప్రపంచంలో, ఆసియా & దేశంలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తులు ఎవరు.?
జ : బెర్నాల్డ్ ఆర్నాల్డ్, ముఖేష్ అంబానీ

3) భూమికి ఎన్ని కిలోమీటర్ల లోపల మహాసముద్రం అందని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు.?
జ : 700 కిలోమీటర్ల లోతులో

4) దేశంలోనే తొలి ముడిచమురు స్టోరేజ్ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు.?
జ : పాడూరు – కర్ణాటక

5) ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నిస్ రికార్డులకు ఎక్కిన 114 సంవత్సరాలు కలిగిన వ్యక్తి ఇటీవల మరణించారు. అతని పేరు ఏమిటి.?
జ : జువాన్ విసెంటీ పెరీజ్ మోరా (వెనిజులా)

6) ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 2

7) ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ : Empowering Autistic Voices

8) మొదటిసారిగా లిథియం అయాన్ బ్యాటరీ కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.?
జ : వడోదర – గుజరాత్

9) ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు ఎంతగా నమోదు కావచ్చు.?
జ : 7.5%

10) ఫోన్ పే యూపీఐ సేవలను తాజాగా ఏ దేశంలో ప్రారంభించింది.?
జ : సింగపూర్

11) అక్షయపాత్ర ఫౌండేషన్ తాజాగా ఎన్నో భోజనాన్ని వడ్డించింది.?
జ : 400 కోట్ల

12) వెయ్యి కిలోమీటర్ల దూరపు లక్ష్యాన్ని చేదించగల హైపర్ సోనిక్ క్షిపణి ని ప్రయోగించినట్లు ఏ దేశం ప్రకటించింది.?
జ : ఉత్తరకొరియా

13) ఉక్రెయిన్ దేశం నిర్బంధ సైనిక శిక్షణ కొరకు వయోపరిమితిని 27 సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాలకు తగ్గించింది.?
జ : 25

14) తైవాన్ దేశంలో నమోదైన భూకంప తీవ్రత ఎంత.?
జ : 7.4

15) గ్రామపంచాయతీలలో 100% సామాజిక తనిఖీలు పూర్తి చేసుకున్న రెండు రాష్ట్రాలు ఏవి ?
జ : తెలంగాణ, కేరళ

16) ఏ దేశ శాస్త్రవేత్తలు 100 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను కృత్రిమ సూర్యుడుతో సృష్టించారు.?
జ : దక్షిణ కొరియా

17) 2000 ఏళ్ల నాటి సీసపు నాణేలను తెలంగాణలో ఏ ప్రాంతంలో ఇటీవల కనుగొన్నారు.?
జ : పణిగిరి – సూర్యాపేట – తెలంగాణ

18) కృత్రిమ మేధస్సు తో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను భారతీయ డెవలపర్ విహెచ్ మూఫీద్ ఆవిష్కరించారు. దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : దేవిక

19) అసోచామ్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : సంజయ్ నాయర్

20) కాంగో దేశపు తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : జుడిత్ సుమిన్వ

21) ఐపీఎల్ 2024 లో అత్యంత వేగవంతమైన బంతి 156.7 కిలోమీటర్ల వేగంతో ఎవరు విసిరారు.?
జ : మయాంక్ యాదవ్