BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 31st JULY 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 31st JULY 2024
1) ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా తొలిసారి ఒక మహిళా అధికారి నియమితులయ్యారు. ఆమె ఎవరు.?
జ : లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ .
2) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) చైర్ పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ప్రీతి సుదన్
3) 2040 వరకు ఎంత శాతం ముంబై నగరం మునిగిపోనున్నట్లు తాజా అధ్యయనం లో తెలింది.?
జ : 10%
4) 2040 వరకు ఎంత శాతం వైజాగ్ నగరం మునిగిపోనున్నట్లు తాజా అధ్యయనం లో తెలింది.?
జ : 5%
5) ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ సంస్థ పొలిటికల్ బ్యూరో చీఫ్ హత్యకు గురయ్యారు. ఆయన పేరు ఏమిటి.?
జ : ఇస్మాయిల్ హనియే
6) జూన్ 2024 లో మౌళిక రంగ వృద్ధి ఎంతగా నమోదు అయింది.?
జ : 4%.
7) 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటును ఇండియా రేటింగ్స్ ఎంతగా అంచనా వేసేంది.?
జ : 7.5%
8) ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగులలో బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ కేటగీరిలలో మొదటి స్థానంలో నిలిచిన ఆటగాళ్లు ఎవరు ?
జ :
జ :జో రూట్ – బ్యాటింగ్
రవీంద్ర జడేజా – ఆల్ రౌండర్
రవిచంద్రన్ అశ్విన్ – బౌలర్
9) ఏ టీమిండియా మాజీ క్రికెటర్ మరణించారు.?
జ : అన్షుమన్ గైక్వాడ్
10) ప్రపంచ లో అత్యంత వేగవంతమైన పిన్నవయస్సు కలిగిన పారా స్విమ్మర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : జియా రాయ్ (16 ఇయర్స్)
11) మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : జూలై 30
12) మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ: Leave No Child behind the fight Against
13) SIDBI బ్యాంకు నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మనోజ్ మిట్టల్
14) 21వ EX KHAN QUEST 2024 పేరుతో ఏ దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి.?
జ : ఇండియా – మంగోలియా