BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 30th JULY 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 30th JULY 2024
1) తెలంగాణలో విద్యుత్తు విచారణ కమిషన్ నూతన చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు. ?
జ : సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మదన్ భీమ్‌రావు లోకూర్
2) 2023 లో దేశవ్యాప్తంగా కుక్క కాటు వలన ఎంత మంది మరణించారని లోక్‌సభ తెలిపింది.?
జ : 286
3) ఫాస్టాగ్ సర్వీసులపై ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న నూతన రూల్ ఏమిటి.?
జ : వాహనం కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఫాస్టాగ్ నంబర్‌లో అప్‌లోడ్ చేయాలి.
4) 2019-20 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్‌ను మెయింటెన్ చేయని ఖాతాదారుల నుంచి జరిమానాల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేశాయి.?
జ : రూ.8,500 కోట్లు
5) పారిస్ ఒలింపిక్స్ లో షూటింగ్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో కాంస్య సాదించిన క్రీడాకారులు ఎవరు.?
జ : మను భాకర్ & సరబ్‌జోత్ సింగ్
6) ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన ప్లేయర్‌గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : మను భాకర్
7) శ్రీలంక తో జరిగిన టీట్వంటీ సిరీస్ ను టీమిండియా ఎంత తేడాతో గెలుచుకుంది.?
జ : 3-0
8) సుందర్ పిచాయ్ కి ఏ ఐఐటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది.?
జ : ఐఐటీ ఖరగ్‌పూర్
9) విదేశాల్లో గత ఐదేళ్లలో మృతి చెందిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఎంత.?
జ : 633 మంది
10) మూడు రోజుల భారత పర్యటన కు వచ్చిన వియత్నాం ప్రధానమంత్రి ఎవరు.?
జ : ఫామ్ మిన్ చిన్
11) ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుండి జీఐ ట్యాగ్ గుర్తింపు పొందినది ఏది.?
జ : లేస్ పార్క్ (రుస్తాంబాద్)
12) టోక్యో లోని ఏ ప్రాంతంలో మహత్మ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.?
జ : ప్రీడమ్ ప్లాజా
13) చలియార్ నది వరదలతో ఏ రాష్ట్రంలో భారీగా ప్రాణనష్టం జరిగింది.?
జ : కేరళ