BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 2nd SEPTEMBER 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 2nd SEPTEMBER 2024
1) ఆగ్నేయాసియా దేశాల్లో ఎంత శాతం రోడ్డు మృతులు ద్వి చక్ర వాహనాదారులేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.?
జ : 66 శాతం
2) కీళ్ల వాతంలో ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అనే ఆరోగ్య సమస్యకు పరిష్కారం చూపే అడ్వాన్స్‌డ్ లూబ్రికెంట్ ను చైనా శాస్త్రవేత్తలు ఏ పేరుతో అభివృద్ధి చేశారు.?
జ : హైడ్రో జెల్.
3) పారా ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో స్వర్ణం, రజతం, కాంస్యం నెగ్గిన భారత క్రీడాకారులు ఎవరు.?
జ : నితేశ్ కుమార్ (ఎస్‌ఎల్3) స్వర్ణం, సుహాస్ యతిరాజ్ (ఎస్‌ఎల్4), తులసిమథి మురుగేశన్ (ఎస్‌యూ5) రజతాలు, మనీష రామదాస్ (ఎస్‌యూ5) కాంస్యం గెలిచింది
4) పారా ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ :సుమిత్ అంటిల్ (ఎఫ్64)
5) పారా ఒలింపిక్స్‌లో డిస్కస్ త్రో లో రజతం నెగ్గిన క్రీడాకారుడు ఎవరు.?
జ : కతునియా యోగేశ్ (ఎఫ్56),
6) పారా ఒలింపిక్స్‌లో హై జంప్ లో సిల్వర్ నెగ్గిన క్రీడా కారుడు ఎవరు.?
జ : నిషాద్ కుమార్ (టీ47)
7) పారా ఛలింపిక్స్‌ఆర్చరీలో మిక్స్‌డ్ డబుల్స్ లో కాంస్యం నెగ్గిన భారత ఆటగాళ్లు ఎవరు .?
జ : శీతల్ దేవి, రాకేశ్ కుమార్ జోడి
8) ప్రపంచ కొబ్బరి దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 02
9) జాతీయ న్యూట్రిషన్ వీక్ ను ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ మొదటి వారం
10) వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES) 2024 కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : భారత్ (గోవా)
11) మోడీ మహారాష్ట్ర లోని పాలఘర్ జిల్లాలో ఏ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.?
జ : వద్వాన్ పోర్ట్