TODAY CURRENT AFFAIRS IN TELUGU 2nd MAY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 2nd MAY 2024

1) భూమికి 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సంకేతాన్ని పంపిన వ్యోమోనౌక ఏది.?
జ : సైకీ వ్యోమోనౌక

2) కొచ్చిన్ తీర ప్రాంతంలో కనుగొన్న అరుదైన టార్టీ గ్రేడ్ జాతి జీవికి ఏ పేరు పెట్టారు.?
జ : బాటలిప్స్ చంద్రయానీ

3) ఎంపాక్స్ వ్యాధి విజృంభణ కారణంగా దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించడానికి కారణమైంది.?
జ : కాంగో

4) భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సలీమా టెటే

5) ఉక్రెయిన్ లోని హ్యారీ పోటర్ కోటగా పిలిచే విద్యా సంస్థ భవనం రష్యా దాడిలో దెబ్బతిన్నది. ఇది ఏ ప్రాంతంలో ఉంది.?
జ : ఒడెస్సా

6) చందమామ ఆవలి భాగము నుండి మట్టి నమూనాలను సేకరించడానికి చైనా ప్రయోగిస్తున్న వ్యోమోనౌక పేరు ఏమిటి?
జ : చాంగే – 6

7) ఏ నానో టెక్ ఎరువులకు కేంద్ర ప్రభుత్వం ఇఫ్కో సంస్థకు అనుమతి ఇచ్చింది.?
జ : నానో జింక్, నానో కాఫర్

8) 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటింగ్ సదస్సు కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది.?
జ : భారత్

9) భారత నావికాదళం కోసం డి ఆర్ డి ఓ తాజాగా పరీక్షించిన మిస్సైల్ పేరు ఏమిటి.?
జ : SMART

10) జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి మరియు సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : హితేశ్ సేతీయా

11) బార్ అసోసియేషన్ కమిటీలో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.?
జ : 33 శాతం

12) అంతర్జాతీయ బ్యాంకుల నుండి ఆదాని గ్రీన్ ఎన్ని మిలియన్ల రుణ సౌకర్యం తాజాగా పొందింది.?
జ : 400 మిలియన్ డాలర్లు

13) గ్రీన్ ఆస్కార్ గా భావించే విట్లే గోల్డ్ అవార్డు 2024 స్వీకరించిన భారతీయ మహిళ ఎవరు.?
జ : పూర్ణిమ దేవి బర్మన్