TODAY CURRENT AFFAIRS IN TELUGU 2nd JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 2nd JUNE 2024

1) ఐసీసీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఓకే ఇన్నింగ్స్ లో పది సిక్సర్ లు బాది రెండో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడు ఎవరు.? గతంలో క్రిస్ గేల్ 11 సిక్సర్లు కొట్టాడు.
జ : ఆరోన్ జోన్స్

2) కువైట్ కొత్త క్రౌన్ ప్రిన్స్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : షేక్ సభా ఖాలెద్ అల్ హమద్ అల్ సబా

3) బ్లూమ్‌బర్గ్ నివేదిక 2024 ప్రకారం ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ఎవరు నిలిచారు.?
జ : గౌతమ్ ఆదాని

4) బ్లూమ్‌బర్గ్ నివేదిక 2024 ప్రకారం ఆదాని, ముఖేష్ అంబానీ లు ప్రపంచ ధనవంతుల జాబితాలో ఏ స్థానంలో ఉన్నారు.?
జ : ఆదాని – 11, ముఖేష్ అంబానీ – 12

5) ఐస్‌ల్యాండ్ అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : హల్లా థామస్ డాటర్

6) అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 లో అత్యధిక స్థానాలను ఏ పార్టీ నెగ్గింది.?
జ : బీజేపీ (48)

7) సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు 2024 లో అత్యధిక స్థానాలను ఏ పార్టీ నెగ్గింది.?
జ : సిక్కిం క్రాంతికారి మోర్చా (31)

8) చంద్రుని అవతలి వైపునకు విజయవంతంగా దిగిన చైనా ల్యాండర్ ఏది.?
జ : చాంగే – 6

9) ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధి ఎంతగా నమోదయింది.?
జ : 8.2%

10) రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక 2023 ప్రకారం బ్యాలన్స్ షీట్ ఎన్ని లక్షల కోట్లకు చేరింది.?
జ : 70.48 లక్షల కోట్లు

11) ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ నివేదిక ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం ఎంతకు చేరింది.?
జ : 183 లక్షల కోట్లు

12) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : జూన్ – 02

13) సైబర్ నేరాల సూచిలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : పదవ స్థానం

14) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత్ కు ఏ దేశం నుండి అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.?
జ : సింగపూర్

15) రెండో ప్రపంచ యుద్ధం విజయానికి గుర్తుగా ఏ తీర ప్రాంతంలో న
మిత్ర రాజ్యాలు 80వ స్మారక వేడుకలు నిర్వహించనున్నాయి.?
జ : నార్మండీ తీరం (ప్రాన్స్)

16) పాకిస్తాన్ దేశంలో తొలి మహిళా బ్రిగేడియర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : హెలెన్ మేరీ

17) నార్వే చెస్ టోర్నీ 2024లో ప్రజ్ఞానందా ఓడించిన ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ఎవరు.?
జ : పాబియానో కరువానా