BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 29th JUNE 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 29th JUNE 2024
1) నేషనల్ స్టాటిస్టిక్స్ డే గా ఏ రోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 29
2) నేషనల్ స్టాటిస్టిక్స్ డే 2024 థీమ్ ఏమిటి.?
జ : Use of data for decision making
3) ఎవరి జయంతి సందర్భంగా నేషనల్ స్టాటిస్టిక్స్ డే ను జరుపుకుంటారు.?
జ : ప్రశాంత చంద్ర మహాలనోబీస్
4) భారత్ ఏ దేశంతో కలిసి ఒపెక్స్ పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహించనుంది.?
జ : ఈజిప్ట్
5) ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : భారత జట్టు ( సౌతాఫ్రికా పై)
6) ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా మరియు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎవరు నిలిచారు.?
జ : MOM – విరాట్ కోహ్లీ
MOT – జస్ప్రీత్ బుమ్రా
7) ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024 విజేతకు మరియు రన్నర్ కు ఇచ్చిన ప్రైజ్ మనీ ఎంత.?
జ : భారత్ : 20.40 కోట్లు, సౌతాఫ్రికా – 10.67 కోట్లు
8) అంతర్జాతీయ టి20 క్రికెట్ కు వీడ్కోలు పలికిన భారత దిగ్గజ ఆటగాళ్లు ఎవరు.?
జ : విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ
9) మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోర్ ను ఏ జట్టు సాధించింది.?
జ : మహిళల భారత జట్టు (603/6)
10) భారత పురుషుల క్రికెట్ జట్టు ఇప్పటివరకు ఎన్ని ఐసీసీ టోర్నీలు గెలుచుకుంది అవి ఏవి .?
జ : 4 (వన్డే – 1983, 2011, T20 – 2007, 2024)
11) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు.?
జ : చల్లా శ్రీనివాసుల శెట్టి
12) కృష్ణా బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అతుల్ జైన్
13) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తొలగింపుకు ఎన్ని వేల కోట్లతో మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తో నాసా ఒప్పందం చేసుకుంది.?
జ : 7 వేల కోట్లు
14) 2024 – 25 లో వస్తుసేవల ఎగుమతుల లక్ష్యం ఎంతగా కేంద్రం ప్రకటించింది.?
జ : 66 లక్షల కోట్లు
15) సీబీడీటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రవి అగర్వాల్
16) ది వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్ తాజా అంచనాల ప్రకారం భారత్ ధనవంతులలో అగ్రవర్ణాలు ఎంత శాతం మంది ఉన్నారు.?
జ : 88% మంది