BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 29th JULY 2024.
TODAY CURRENT AFFAIRS IN TELUGU 29th JULY 2024.
1) రెండో విడత రైతు రుణమాఫీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ఉన్న రుణాలు మాఫీ చేసింది.?
జ : లక్షన్నర వరకు ఉన్న రుణాలు మాఫీ.
2) తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : జిష్ణుదేవ్ వర్మ
3) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ రుణాలతో కలిపి కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు ఎంత.?
జ : రూ.185 లక్షల కోట్లు
4) దేశపు అప్పు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఎఔత శాతానికి చేరినట్లు కేంద్రం తెలిపింది.?
జ : 56.8 శాతానికి
5) పాము కాటు వల్ల దేశంలో ఏటా ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని లోక్సభ లో తెలిపారు.?
జ : 50 వేల మంది
6) వెనిజువెలా నూతన అధ్యక్షుడిగా ఎవరు వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు.?
జ : నికోలస్ మదురో
7) 2025 ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది.?
జ : భారత్
8) ఏ ఆటగాడు టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు.?
జ : రోహన్ బోపన్న
9) ఆర్బీఐ నివేదిక ప్రకారం జీడీపీలో 5వ వంతుకు డిజిటల్ ఎకానమి ఏ సంవత్సరం వరకు చేరనుంది.?
జ : 2026
10) మదుపర్ల కోసం సెబీ ప్రారంభించిన చాట్‌బాట్ పేరు ఏమిటి.?
జ : సేవ
11) తాజాగా యూనికార్న్ హోదా పొందిన సంస్థ ఏది.?
జ : రాపిడో
12) గ్లోబల్ స్పిర్చువాలిటీ సదస్సు 2024 ఏ నగరంలో నిర్వహించారు.?
జ : హైదరాబాద్
13) కెరీర్ లో 10 ఒలింపిక్స్ గేమ్స్ ఆడిన మొదటి క్రీడాకారిణి గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : నినో సలుక్వాడ్జే
14) వరల్డ్ హెపటైటిస్ దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ : It’s time for Action.