TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th JULY 2024

1) మొబైల్‌ ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : రెండో స్థానంలో

2) గర్భం దాల్చడం వ్యాధి లేదా అంగవైకల్యం కాదని, మహిళకు ప్రభుత్వోద్యోగాన్ని నిరాకరించడానికి ఇది ఓ కారణం కాకూడదని ఏ హైకోర్టు తీర్పు చెప్పింది.?
జ : ఢిల్లీ హైకోర్టు

3) బాల్య వివాహాల నిషేధ చట్టం-2006 అన్ని మతాలవారికి వర్తిస్తుందని ఏ హైకోర్టు తీర్పు చెప్పింది.?
జ : కేరళ హైకోర్టు

4) బ్రెజిల్‌కు చెందిన ఎవరు ఒకే కంపెనీలో 84 ఏండ్లు పని చేసి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు.?
జ : వాల్టర్‌ ఆర్థ్‌మ్యాన్‌ (100)

5) ఒలింపిక్స్ 2024 మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం నెగ్గిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : మనూ భాకర్‌ (221.7)

6) మహిళల ఆసియా కప్‌ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ :. శ్రీలంక (భారత్ పై)

7) ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డును ఇటీవల ఏ భారతీయునికి ప్రకటించారు.?
జ : రతన్ టాటా

8) రామచరిత మనస్ కథను మొదటిసారి ఐరాస లో ఎవరు వినిపించనున్నారు.?
జ : మొరారీ బాపు

9) ఈశాన్య భారతదేశం లో తొలి ఏఐ టీచర్ గా ఎవరు గుర్తింపు పొందారు.?
జ : ఐరీస్

10) ఏపీలో మధ్యాహ్న భోజన పథకానికి ఎవరి పేరు పెట్టారు.?
జ : డొక్కా సీతమ్మ

11) “కోవర్ట్ : ద సైకాలజీ ఆప్ వార్ & పీస్” పుస్తక రచయిత ఎవరు.?
జ : అమర్‌జీత్ సింగ్

12) మహారాష్ట్ర నూతన గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సీపీ రాధకృష్ణన్

13) దక్షిణాఫ్రికా లోని ఏ ప్రాంతాలను యునెస్కో వారసత్వ జాబితాలోకి చేర్చారు.?
జ : నెల్సన్ మండెలా నివాస ప్రాంతాలు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు