TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th FEBRUARY 2024

1) మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం 2023 – 24 మరియు 2024 – 25 ఆర్థిక సంవత్సరాలలో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు కావచ్చు.?
జ : 6.9% & 6.5%

2) కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం 2024 – 25 లో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు కావచ్చు.?
జ : 7 శాతం

3) అత్యధికంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ స్టేషన్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి.?
జ : కర్ణాటక

4) బిపిసిఎల్ 25 వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ స్టేషన్ మరియు ఫ్యుయల్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ఏ విమానాశ్రయంతో ఒప్పందం చేసుకుంది.?
జ : కోచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

5) అంతరిక్ష రంగంలో ఏ విభాగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.?
జ : అంతరిక్ష విడిభాగాల తయారీ

6) గగన్ యాన్ ప్రయోగంలో భాగంగా ఇస్రో వ్యోమగాములను ఎన్ని కిలోమీటర్ల దూరంలోకి తీసుకెళ్లి, తిరిగి భూమి మీదకు తీసుకురానుంది.?
జ : 400 కిలోమీటర్లు

7) ఏ గ్రహ సకలాలపై నీటి జడలు ఉన్నట్లు సోఫియా అనే టెలిస్కోప్ గుర్తించింది.?
జ : ఐరీస్, మస్సాలియా

9) కాంతితో పనిచేసే చిప్ ను ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు

10) శ్వాసతో వ్యాధులను గుర్తించే సాంకేతికతను ఏ ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : ఐఐటి జోధ్‌పూర్

11) దాదాసాహెబ్ పాల్కే అవార్డులు 2024లో ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్లు ఎవరు నిలిచారు.?
జ : షారుక్ ఖాన్, నయనతార

12) ప్రపంచ బ్యాంక్ వాతావరణ నిధి ని పొందిన తొలి రాష్ట్రం ఏది.?
జ : గోవా

13) భారత ఫుట్ బాల్ జట్టులో చోటు సంపాదించుకున్న తెలంగాణ యువతి ఎవరు.?
జ : గుగులోత్ సౌమ్య

14) బీబీసీ చైర్మన్ గొ బాధ్యతలు చేపట్టిన ప్రవాస భారతీయుడైన సమీర్ షా భారత్ లోని ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి .?
జ : మహారాష్ట్ర