TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th FEBRUARY 2024
1) అవినీతి ఆరోపణలతో పోర్చుగల్ ప్రధాని రాజీనామా చేశారు. అతని పేరు ఏమిటి.?
జ : అంటోనియో కోస్టా
2) జపాన్ లో 1000 సంవత్సరాలుగా సాగుతున్న ఏ ఫెస్టివల్ ను ఇక నుండి జరుపుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు.
జ : నేక్డ్ మెన్ ఫెస్టివల్
3) హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2024లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 85
4) హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2024లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : ఫ్రాన్స్
5) మార్నింగ్ కన్సల్ట్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత ఎవరు.?
జ : నరేంద్ర మోడీ
6) ఇటీవల భారత్ ను సందర్శించిన గ్రీస్ ప్రధానమంత్రి ఎవరు.?
జ : కిరియాకోస్ మిట్సోటకిస్
7) విద్యార్థులు డీ హైడ్రేషన్ కు గురికాకుండా పాఠశాలల్లో వాటర్ బెల్ ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది.?
జ : కేరళ
8) యువత కెరీర్ లక్ష్యాలను సాధించడానికి వడ్డీ లేని రుణాలను అందించే స్వయం పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది.?
జ : ఒడిశా
9) మొక్కలు నాటడానికి గొయ్యి తీసినందుకు 20/-, మొక్కలు నాటినందుకు 30/- రూపాయల చొప్పున అందించే ఏ కార్యక్రమాన్ని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.?
జ : వనమిత్ర
10) విశ్వకర్మ యోజన పథకం నమోదు అంశంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి.?
జ : కర్ణాటక, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్
11) 6,050 కోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణలో సోలార్ ప్యానల్ ఏర్పాటుకు పరిశ్రమ స్థాపించడానికి ఏ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.?
జ : రెన్యూసిస్ ఇండియా
12) ఐపీఎల్ ప్రారంభమై పదహారేళ్ల పూర్తయిన సందర్భంగా ఎంపిక చేసిన జట్టుకు కెప్టెన్ ఎవరిని నియమించింది.?
జ : మహేంద్రసింగ్ ధోని
13) అమెరికన్ బాస్కెట్ బాల్ మాజీ ఆటగాడు ఇటీవల క్యాన్సర్ తో కన్నుమూశారు. అతని పేరు ఏమిటి.?
జ : రాబర్ట్ రీడ్
14) జపరీస్ సంస్థ నివేదిక ప్రకారం భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏ సంవత్సరం నాటికి చేరుకోనుంది.?
జ : 2027