BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th AUGUST 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th AUGUST 2024
1) కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్తగా ఐదు జిల్లాల ఏర్పాటు కు కేంద్రం ప్రకటన చేసింది. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య ఎంతకు చేరనుంది.?
జ : 7
2) 2024 – 25 లో కొత్తగా ఓపెన్ చేసిన జన్ ధన్ ఖాతాల సంఖ్య ఎంత.?
జ : 3 కోట్లు
3) జాతీయ భద్రతా దళం (NSG) నూతన డీజీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : బి. శ్రీనివాసన్
4) పారా ఒలింపిక్స్ 2024 లో పాల్కొంటున్న దేశాల సంఖ్య ?
జ : 168
5) పురుషుల టీట్వంటీ లలో వరుసగా 14 మ్యాచ్ లు నెగ్గిన తొలి జట్టు గా ఏ జట్టు రికార్డు సృష్టించింది.?
జ : స్పెయిన్
6) ఏ కార్పొరేషన్ నుంచి తెలంగాణకు ఏటా 200 మెగావాట్ల సౌర విద్యుత్తు అందనునుంది.?
జ : నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌సీ)
7) తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన 4వ పులుల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎన్ని పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.?
జ : 33
8) కొత్త ఉస్మానియా ఆస్పత్రిని 32 ఎకరాల్లో ఎక్కడ నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : గోషామహల్‌లో
9) రైల్వే బోర్డు చైర్మన్‌గా ఎవరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది.?
జ : సతీశ్ కుమార్
10) ముక్కు ద్వారా అందించే కొవిడ్-19 టీకాను గ్రిఫిత్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని పేరు ఏమిటి.?
జ : ‘సీడీఓ-7ఎన్-1′
11) యాపిల్ నూతన CFO గా భారత సంతతికి చెందిన ఎవరు నియమితులయ్యారు.?
జ : కెవన్ పరేఖ్
12) కరువు కోరల్లో చిక్కుకొన్న ప్రజల కడుపు నింపేందుకు 723 వన్య ప్రాణులను వధించాలని ఏ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : నమీబియా
13) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సుమారు ఎన్ని కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ?
జ : 24 కోట్ల
14) ఏ దేశ శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలం నుంచి సేకరించిన మట్టి నుంచి నీటిని వెలికితీశారు.?
జ : చైనా
15) భారత్ బయోటెక్ నోటిద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ ను ఏ పేరు తో అందుబాటులోకి తీసుకొచ్చింది.?
జ : ‘హిల్ కాల్’
16) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన చైర్మన్‌గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.?
జ : జై షా