Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th JANUARY 2024

1) 2024 సంబంధించి భారత ప్రభుత్వం ఎంతమందికి పద్మ అవార్డులు ప్రకటించింది.?
జ : 132 (పద్మ విభూషణ్ – 5, పద్మభూషణ్ – 17, పద్మశ్రీ – 110)

2) పద్మభూషణ్ – 2024 అవార్డులలో విదేశాల నుండి పద్మభూషణ్ పొందిన ఒకే ఒక వ్యక్తి ఎవరు.?
జ : యాంగ్ లీ (పాక్స్‌కాన్ చైర్మన్ – తైవాన్)

3) 2024 గణతంత్ర దినోత్సవ వేడుకలకు హజరైన ముఖ్య అతిధి ఎవరు.?
జ : ఇమాన్యుయోల్ మెక్రాన్ (ప్రాన్స్ అధ్యక్షుడు)

4) గణతంత్ర దినోత్సవ వేడుకలు 2024 లో తొలిసారి త్రివిధ దళాలకు విన్యాసాలలో మహిళలే పాల్గొన్నారు. వీరికి ఎవరు నేతృత్వం వహించారు.?
జ : కెప్టెన్ సంద్య

5) నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష అమలు చేసిన తొలి దేశం ఏది. ఎవరికి ఈ పద్దతిలో మరణ శిక్ష విధించింది.?
జ : అమెరికా – కెన్నెత్ స్మిత్

6) RBI నివేదిక ప్రకారం 2000 – 2023 సంవత్సరాల మద్య అత్యధికంగా పంచాయతీల ద్వారా రెవెన్యూ వసూళ్లు చేసిన రాష్ట్రం ఏది.?
జ : కేరళ

7) GSLV – F14 రాకెట్ ను ఇస్రో ఎప్పుడు ప్రయోగించనుంది.?
జ : ఫిబ్రవరి – 17

8) GSLV – F14 రాకెట్ ను ఇస్రో ఏ శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపనుంది.?
జ : INSAT – 3DS

9) ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ 147 బంతుల్లో చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : తన్మయ్ అగర్వాల్

10) అంగారక గ్రహం పైకి పంపిన ఏ హెలికాప్టర్ తన పనిని ముగించుకున్నట్లు నాసా ప్రకటించింది.?
జ : ఇంజెన్యూటి

11) TSPSC చైర్మన్ గా తెలంగాణ ప్రభుత్వం ఎవరిని నియమించింది.?
జ : మహేందర్ రెడ్డి

12) 2030 నాటికి తమ దేశంలో ఎంతమంది భారతీయ విద్యార్థులకు విద్య అందించాలని ప్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రకటించారు.?
జ : 30వేల మందికి

13) దేశంలో తాజాగా ఓటర్ల సంఖ్య ఎంతకు చేరినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.?
జ : 96 కోట్లు

14) తాజాగా ఏ దేశ క్రికెట్ బోర్డు పురుష మరియు మహిళ క్రికెటర్లకు సమానంగా ఫీజు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.?
జ : వెస్టిండీస్ క్రికెట్ బోర్డు

15) పురాతన కాలంనాటి వైరస్ లు ఇటీవల మంచు పొరలు కరగడం వలన బయటపడ్డాయి. వాటికి ఏమని పేరు పెట్టారు.?
జ : జాంబీ వైరస్

16) freedom of city of London award ను అందుకున్న ప్రవాసభారతీయుడు ఎవరు.?
జ : అజిత్ మిశ్రా